బిజినెస్

5జీ సాంకేతికతతో గణనీయ పారిశ్రామిక ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: రాబోయే 5జీ సాంకేతికత దేశంలో పరిశ్రమల యాజమాన్యాలు అంతర్జాతీయ మార్కెట్లను అందిపుచ్చుకోవడానికి సువర్ణావకాశం కానుందని 2018-19 ఆర్థిక నివేదికలు స్పష్టం చేశాయి. ప్రథానంగా డిజిటల్ చెల్లింపులు, వైజ్ఞానిక, సేవా పరమైన ఆర్థికాభివృద్ధిని పారిశ్రామికులు సంతరించుకునే అవకాశాలున్నాయని ఆ సర్వే పేర్కొంది. 2020 నాటికి దేశాన్ని 5జీ సాంకేతికతకు అనుగుణంగా సంసిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 5జీ కోసం రేడియో తరంగాలను సరఫరా చేసేందుకు సెక్ట్రం వేలానికి సైతం ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయాన్ని ఆ నివేదిక గుర్తు చేసింది. గురువారం ఈ నివేదిక పార్లమెంటుకు అందింది. 5జీ సదుపాయం వల్ల వినియోగదారులు పౌరులకు ఇళ్లవద్దకు చేరే ప్రభుత్వ ఫలాలను, సేవలను, వైద్య సదుపాయాలను, లబ్ధికి సంబంధించిన లావాదేవీలను, విద్య, వినోదం తదితర అంశాలపై మరింతగా అవగాహన ఏర్పరచుకుని నియోగించుకునేందుకు, డిజిటల్ చెల్లింపులు చేస్తూ సేవాపరమైన ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమయ్యేందుకు వీలుంటుందని ఆ నివేదిక తెలిపింది. ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై సైతం అవగాహనతో మెలగేందుకు వీలుంటుందని తెలిపింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సిపారసుల మేరకు ఎనిమిది సిగ్నల్ బ్రాండ్లకు చెందిన 8,644 ఎంహెచ్‌జెడ్ ఫ్రీక్వెన్సీలను వేలం ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో 700 ఎంహెచ్‌జెడ్, 800 ఎంహెచ్‌జెడ్, 3.3 నుంచి 3.4 గిగాహెట్స్ (జీహెచ్‌జెడ్), 3.4-3.6 జీహెచ్‌జెడ్ తదితర ఫ్రీక్వెన్సీలున్నాయి. ఇవి దాదాపు 4.9 లక్షల కోట్ల అంచనాలతో కూడుకున్నవి. కాగా దీనిపై ఐసీఆర్‌ఐఈఆర్, బీఐఎఫ్ సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేయగాట్రాయ్ సిఫారసు చేసిన స్పెక్ట్రం ధరలు అధికంగా ఉన్నాయని నివేదిక తేల్చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 5జీపై ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయగా 2018 ఆగస్టులో అధ్యయన నివేదిక సమర్పించింది. ఆమేరకు భారత్‌ను 5జీకి అనుగుణంగా తీర్చిదిద్దే చర్యలు కేంద్రం చేపట్టింది.