బిజినెస్

ఆర్థిక సర్వేలతో సానుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 4: ఈ ఏడాది దేశ ఆర్థికాభివృద్ధి ఐదేళ్ల కనిష్ట స్థాయి నుంచి 7 శాతానికి పెరుగుతుందన్న ఆర్థిక సర్వే నివేదికలతో దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఊతం లభించింది. దీంతో సూచీలు వరుసగా నాలుగో రోజైన గురువారం సైతం ఓ మోస్తరు లాభాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 68.81 పాయింట్ల ఆధిక్యతతో 0.17 శాతం లాభపడి 39,908.06 పాయింట్ల గరిష్ట స్ధాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 39.979.10 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 39,858.33 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 30 పాయింట్లు ఆధిక్యతతో 0.25 శాతం లాభపడి 11,946.75 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ సైతం ఓ దశలో 11,969.25 పాయింట్ల గరిష్టానికి, మరో దశలో 11,923.65 పాయింట్ల కనిష్టానికి చేరింది. సెనె్సక్స్ ప్యాక్‌లో భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, ఏసియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్ అత్యధికంగా 2.53 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఎస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, వేదాంత, సన్‌పార్మా, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ అత్యధికంగా 3.56 శాతం నష్టపోయాయి. కాగా సానుకూలమైన ఆర్థిక సర్వే అంచనాలతోనే స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ప్రభావితమైందని విశే్లషకులు అంచనా వేశారు. 2019-20లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు గత ఏడాది అంచనా వేసిన 6.8శాతం కంటే అధికంగా 7 శాతం వరకు ఉంటుందని ఆర్థిక సర్వే నివేదికలు పేర్కొన్నాయి. అలాగే 2020లో పెట్టుబడుల రేటు సైతం గణనీయంగా పెరుగుతుందని ఆ నివేదికలు తేల్చాయి. అయితే రుతుపవనాల ప్రభావం బలహీనంగా ఉన్న కారణంగా వృద్ధికి అనుగుణంగా లాభాల రాకలో మాత్రం తగ్గుదల నెలకొనవచ్చని సర్వే నివేదిక పేర్కొంది. ఇలావుండగా శుక్రవారం కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నందువల్ల గురువారం సైతం మదుపర్లు వేచిచూసే వైఖరిని అవలంభించారు.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం 24 పైసలు పెరిగి ఇంట్రాడేలో మొత్తం 68.89 రూపాయలుగా ట్రేడైంది. ఇక ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే షాంఘై, హాంగ్‌కాంగ్ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగియగా, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాలను సంతరించుకున్నాయి. ఇక ఐరోపా ఈక్విటీ మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలతోనే సాగాయి. కాగా ముడిచమురు ధరలు 0.08 శాతం తగ్గి బ్యారెల్ 63.77 డాలర్ల వంతున విక్రయాలు జరిగాయి.