బిజినెస్

ఉక్కు కిరీటంలో మరో కొత్త బ్యాటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉక్కునగరం, జూలై 5: ఉక్కు కిరీటంలో మరో కొత్త కోక్ ఓవెన్ బ్యాటరీ చేరింది. విశాఖ ఉక్కు 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవడానికి కొత్త బ్యాటరీ ఆలంబనగా నిలుస్తుంది. రూ.2500 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో కొత్తగా నిర్మించిన కోక్ ఓవెన్ బ్యాటరీ-5 చినీని సీఎండీ పీకే రథ్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు.
ఈ బ్యాటరీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వృథా ఉష్ణోగ్రత సేకరణ ద్వారా 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. కోక్ చార్జింగ్ ద్వారా హీట్ పుషింగ్ చేయడానికి అవసరమైన నిర్ణీత ఉష్ణోగ్రతలు వస్తే కొత్త బ్యాటరీ మరో 15 రోజుల్లో అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. 8.40 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో పని చేసే ఈ బ్యాటరీలో బ్లాస్ట్ఫ్‌ర్నేస్ గ్రేడ్ కోక్ ఉత్పత్తి అవుతుంది.ప్రస్తుతం ఉక్కు కర్మాగారంలో ఉన్న నాలుగు కోక్ ఓవెన్స్ బ్యాటరీల ద్వారా ఏడాదికి 2.48 మిలియన్ టన్నుల బ్లాస్ట్ఫ్‌ర్నేస్ గ్రేడ్ కోక్ ఉత్పత్తి అవుతోంది. కొత్త బ్యాటరీని పాత వాటిలాగానే టాప్ ఛార్జింగ్ చేసే విధంగానే 67 ఓవెన్లతో 7 మీటర్ల పొడవున నిర్మించారు. కొత్త చినీని 2450 క్యూబిక్ మీటర్ల ఆర్‌సీసీ స్ట్రక్చరల్‌తో 120 మీటర్ల పొడవున నిర్మించారు.
చినీ లోపల వైపు1300 టన్నుల రిఫ్యాక్టరీ పనులను చేపట్టారు. బీఈసీ కన్సార్టీయం ఆధ్వర్యంలో ఉక్కు అధికారులు, మెకాన్ సంస్థ, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో బ్యాటరీ, చినీ పనులను పూర్తి చేశారు. కార్యక్రమంలో ఉక్కు డైరెక్టర్లు వారణాసి వెంకట వేణు గోపాల్, ప్రబీర్ రాయ్ చౌదరీ, కిషోర్ చంద్ర దాస్, ఈడీ ఆర్.నాగరాజన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.