బిజినెస్

పర్యాటక రంగానికి రూ.1,378.53 కోట్లు కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: కేంద్ర బడ్జెట్‌లో సాంస్కృతి, పర్యాటక రంగాలకు స్వల్ప కేటాయింపులే జరిగాయి. పర్యాటక శాఖలో వౌలిక సదుపాయాల కల్పనకు 1,378.53 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే ప్రచారం, ప్రోత్సహకాల కింద 575 కోట్లు ఖర్చుచేస్తారు. కేంద్ర సంస్కృతిక వ్యవహారాల శాఖకు 875.33 కోట్లు కేటాయించారు. దేశ వ్యాప్తంగా 17 ప్రసిద్ధ కేంద్రాలను పర్యాటక హబ్‌లుగా తీర్చిదిద్దుతారు. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అన్ని హంగులూ సమకూర్చనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అనువైన సదుపాయాల కల్పన, వౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
పర్యాటక కేంద్రాలుగా 17 చారిత్రాత్మక ప్రాంతాలు
దేశంలోని 17 చారిత్రాత్మక ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర మంత్రి సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదించారు. తద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయిలో వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వంద కొత్త కేంద్రాల ఏర్పాటు వల్ల 50 వేల మంది వృత్తి కళాకారులకు ఆర్థిక సహకారం అందుతుందని ఆమె వివరించారు. గిరిజన సంస్కృతిని కాపాడుతామని, ఇంకా సంప్రదాయ కళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆమె తెలిపారు.