బిజినెస్

‘స్టడీ ఇన్ ఇండియా’కు రూ. 400 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: కేంద్రం 2019-20 వార్షిక బడ్జెట్‌లో ‘స్టడీ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద రూ. 400 కోట్ల రూపాయలను కేటాయించారు. భారత్‌లో ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, విదేశీ విద్యార్థులను ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకోనున్నట్టు కేంద్రం ప్రకటించింది. నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలుచేస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ దానికి రూ. 400 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు పార్లమెంట్‌లో ప్రకటించారు. ఉన్నత విద్యారంగంలో ప్రమాణాలు పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. పాఠశాలలు, కళాశాలను సంస్కరిస్తామని, వౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. దీని కోసం నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ ఏర్పాటుచేసి పరిశోధనలకు ప్రోత్సాహాన్ని ఇస్తారన్నారు. భారత్‌లో ప్రపంచ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని నిర్మలాసీతారామన్ వెల్లడించారు. ఈ రంగంలో గతంలోకంటే మూడు రెట్లు అధికంగా కేటాయింపులు జరిగాయని ఆమె అన్నారు. దేశంలో క్రీడల అభివృద్ధికి ‘ఖేలో ఇండియా పథకం’ను బడ్జెట్‌లో ప్రకటించారు.