బిజినెస్

అధికారుల శిక్షణకు రూ. 235 కోట్లుc

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: ప్రభుత్వ ఉన్నతాధికారులు దేశవిదేశాల్లో తమ తమ రంగాల్లో శిక్షణ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 235 కోట్ల రూపాయలకు పైగా తాజా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారంనాడు ప్రవేశపెట్టిన 2019-20 బడ్జెట్‌లో ఉన్నతాధికారుల శిక్షణకు మొత్తం 235.91 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇది గత బడ్జెట్‌లో రూ.194.76 కోట్లుగా ఉంది. సంబంధిత మంత్రిత్వ శాఖ పరిధిలో గల ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజిమెంట్ (ఐఎస్‌టీఎం), మైసూర్‌లోని లాల్ బహదూర్ శాస్ర్తీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ) సంయుక్తంగా ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులకు పలు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందుకుగాను 156.77 కోట్ల రూపాయలు తాజా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. ఐఎస్‌టీఎం, ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ సంస్థలను మరింత బలం గా రూపొందించేందుకు, అధికారుల శిక్షణకు అవసరమైన సౌకర్యాల కల్పన కూడా ఈ నిధులతోనే చేపట్టనున్నారు. స్ట్ఫా సెలక్షన్ కమిటీ (ఎస్‌ఎస్‌సీ) కేంద్ర పరిధిలోని పలు ఉద్యోగాల భర్తీకి వివిధ పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుత బడ్జెట్‌లో 240.22 కోట్ల రూపాయలు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఇది 227.11 కోట్లుగా ఉంది.