బిజినెస్

విద్యుత్ రంగాభివృద్ధికి త్వరలో ప్రత్యేక ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: విద్యుత్ రంగాభివృద్ధికి త్వరలో ఓ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి, నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తెలిపారు. ప్రత్యేకించి ‘ఒక దేశం..ఒక గ్రిడ్’ అనే విధానాన్ని అమలు చేసేందుకు కృషి జరుగుతోందని ఆమె చెప్పారు. 2022 నాటికి 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని గ్రామీణ ప్రాంతాల్లో కోరుకున్న వారందరికీ వంట గ్యాస్, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. 2015 నవంబర్‌లో ‘ఉజ్వల్ డిస్కమ్ హామీ యోజన (ఉదయ్) పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని, డిస్కంల ఆర్థిక, నిర్వహణ స్థితిగతులను మెరుగుపరచాలన్నదే దీని లక్ష్యమన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్న ఈ విద్యుత్ సరఫరా విభాగాన్ని పునద్ధరించేందుకు ఏర్పాటు చేసిన ఈ పథకం పనితీరుపై ప్రభుత్వం నిశిత పరిశీలన చేస్తోందని, భవిష్యత్తులో ఇది మరింతగా బలపడుతుందని పేర్కొన్నారు. పారిశ్రామిక పారిశ్రామిక వినియోగంతోబాటు ఇతర పెద్దమొత్తాల విద్యుత్ వినియోగదారులకు బహిరంగ విద్యుత్ అమ్మకాలపై లేదా ప్రథాన ఉత్పత్తులపై ఎదురవుతున్న క్రాస్ సబ్సిడీ సర్ చార్జీలు, అవాంచిత సుంకాలు తదితర సమస్యలపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో నిర్మాణాత్మక సంస్కరణలతోబాటు, ఆమోదయోగ్యమైన సంస్కరణలను అమలు చేయాల్సి వుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. త్వరలో విద్యుత్ విక్రయాలకు సంబంధించిన ధరలతో కూడిన ప్యాకేజీని, నిర్మాణాత్మక సంస్కరణలను ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. కనెక్టివిటీకి సంబంధించిన వౌలిక సదుపాయాలను మరోస్థాయికి తీసుకవెళ్లే చర్యల్లో భాగంగా ‘ఒక దేశం..ఒక గ్రిడ్’ విధానాన్ని విజయవంతంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి ఒక బ్లూ ప్రింట్‌ను ఈ ఏడాది రూపొందించి గ్యాస్ గ్రిడ్‌లు, వాటర్ గ్రిడ్‌లు, సమాచార మార్గాలు, ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆమె చెప్పారు. ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఐతే గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల పునరుద్ధరణపై ప్రభుత్వానికి ఆసక్తి లేదని ఆమె ప్రకటించారు.