బిజినెస్

చెల్లింపులు 50 లక్షలు దాటితే.. టీడీఎస్ తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: పన్నుల పరిధిని విస్తరించుకొనేందుకు ఆర్థిక మంత్రి సీతారామన్ తన బడ్జెట్‌లో మరో ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక ఏడాది కాలంలో కాంట్రాక్టర్లకు లేదా వృత్తి నిపుణులకు చెల్లించే మొత్తం 50 లక్షల రూపాయలు దాటితే దానిపై ఐదు శాతం టీడీఎస్ వసూలు చేయాలని సంకల్పించారు. సదరు వ్యక్తులు తమ పాన్ నంబర్‌ను ఉటంకించడం ద్వారా ఈ టీడీఎస్ మొత్తాన్ని ట్రెజరీలో జమ చేయవచ్చని తెలిపారు. కరెంట్ ఖాతాలో కోటి రూపాయలకు పైగా డిపాజిట్ చేసినా.. విద్యుత్ బిల్లులను లక్ష రూపాయిలకు పైగా చెల్లించినా ఓ ఏడాది కాలంలో విదేశీ పర్యటనలపై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా తప్పనిసరిగా ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిందేనని ఈ బడ్జెట్‌లో స్పష్టం చేశారు.