బిజినెస్

ఆధార్ ఉన్నా చాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: ఆధార్, పాన్ కార్డుల విషయంలో దేశవ్యాప్తంగా గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి సీతారామన్ జన బాహుళ్యానికి ఊరట కలిగించే ప్రతిపాదన చేశారు. ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి పాన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు అయినా ఉపయోగించుకొనే వెసులుబాటును కల్పించారు. భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు దేశంలోకి వచ్చిన వెంటనే ఆధార్ కార్డులను సమకూరుస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు ఇందుకు సంబంధించి 180 రోజుల పాటు వీరు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడలాంటి జాప్యానికి ఆస్కారం లేకుండా వీరికి ఆధార్ కార్డులను మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.