బిజినెస్

మెగా సౌర విద్యుత్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: దేశంలో మెగా తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ సంస్థలను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకురానుంది. ప్రధానంగా సౌర విద్యుత్ సెల్స్, బ్యాటరీలు, సౌర చార్జింగ్ వౌలిక వసతులు వంటివి స్థానికంగానే తయారు చేసేందుకు ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వేలం విధానాన్ని చేపట్టి పెట్టుబడులపై ప్రత్యేక పన్ను రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక పథకాన్ని శుక్రవారం లోక్‌సభలో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పొందుపరచడం జరిగింది. సౌర విద్యుత్ ప్లాంట్లతోబాటు సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఈ ప్రత్యేక పథకం దోహదం చేస్తుందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సోలార్ ఫొటో వొలాటిక్ సెల్స్, లిథియం స్టోరేజీ బ్యాటరీలు, సోలార్ విద్యుత్ చార్జింగ్‌కు సంబంధించిన వౌలిక పరికరాలు, కప్యూటర్ సర్వీసులు, ల్యాప్‌ట్యాప్‌లు వగైరా తయారీలను ఈ పథకం కిందకు చేర్చామని మంత్రి వివరించారు. ఈ పథకం ద్వారా పెట్టుబడులకు అనుసంధానమైన ఆదాయ పన్ను మినహాయింపులను చట్టంలోని 35ఏడీ అధికరణం ద్వారా సమకూర్చడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం మనదేశంలో అవసరమైన సౌర విద్యుత్ పరికరాల తయారీ జరగడం లేదని ఈ సమస్య చాలా ఏళ్లుగా ఉందని ఆమె తెలిపారు. దేశంలో ఈ ప్రాజెక్టుల అభివృద్ధి చేయగోరేవారు ఎక్కువగా దిగుమతులపై ఆదారపడాల్సి వస్తోందన్నారు. సంప్రదాయేతర విద్యుత్ వినియోగాన్ని 2022 నాటికి 175 గిగావాట్లకు పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం చేరుకోవడం కోసమే ఈ ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత పారిశ్రామిక అంచనాల ప్రకారం దేశీయంగా 12 గిగావాట్ల సోలార్ సెల్, మోడ్యూల్ తయారీ సామర్థ్యం మాత్రమే ఉందని నిర్మల వెల్లడించారు. ఆర్థిక సర్వే ప్రకారం వచ్చే దశాబ్ధ కాలంలో దేశంలో సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి 30 బిలియన్ డాలర్లు ప్రతి ఏటా ఖర్చు చేయాలన్న లక్ష్యం ఉంది.