బిజినెస్

సంప్రదాయానికి స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరం కోసం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధాన అంశాలపై కేంద్రీకరించి, గత సంప్రదాయానికి స్వస్తి పలికిందని, మోదీ రెండో దఫా ప్రభుత్వానికి స్పష్టమయిన దిశను నిర్దేశించిందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆయన శనివారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశే్లషించారు.
రానున్న పదేళ్ల కాలానికి ఒక రోడ్‌మ్యాప్‌ను వేసేందుకు వీలుగా ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వార్షిక బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రతిపాదనలు ఏవీ లేవనే ప్రతిపక్షాల విమర్శలపై ఆయన స్పందిస్తూ, ఆరు నెలల క్రితం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లోనే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. అయిదు లక్షలకు పెంచడం జరిగిందని, ఆర్థిక సంయమనం కారణంగా ఇలాంటి రాయితీలను ఎల్లకాలం మళ్లీ మళ్లీ ప్రకటించజాలరని అన్నారు. ‘మధ్య తరగతి ప్రజల అంశానికి సంబంధించి, ప్రతి బడ్జెట్‌లో వారికి ఉపశమనం కలిగించే ప్రతిపాదనలు ఉండి తీరాలని నేను అనుకోవడం లేదు. ఆరు నెలల క్రితం మధ్య తరగతి ప్రజల కోసం పన్ను మినహాయింపు పరిమితిని రూ. అయిదు లక్షలకు పెంచిన విషయం మీకు తెలుసు. మళ్లీ చేయాలని ఎలా అంటారు?’ అని రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ఆర్థిక వనరులు అవసరం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అదే పని చేస్తున్నదని, దాంతో పాటు ఇనె్వస్టర్లకు అనేక విధాలుగా సహాయపడటానికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.