బిజినెస్

డీజిల్ పెంపుతో ఆర్టీసీపై రూ. 80కోట్ల అదనపు భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 6: ఏపీఎస్ ఆర్టీసీ కొనే్నళ్లుగా నష్టాల ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతుండగా మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మరోవైపు డీజిల్ ధరల భారం పడింది. కేంద్ర బడ్జెట్‌లో ఒక రూపాయి సెస్ విధింపు, దీనిపై పెరిగిన ఇతరత్రా పన్నులతో కలిసి లీటర్‌కు రూ. 2.70 పైసలు భారం పడినట్లయిందని సంస్థ ఎండీ ఎన్వీ సురేంద్రబాబు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీలో సాలీనా 30కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుంది. ఈ ప్రకారం ఒక్కసారిగా ఆర్టీసీపై సాలీనా రూ. 80కోట్ల అదనపు భారం పడినట్లయింది. ఆర్టీసీ చార్జీలు నయా పైసా పెరగనప్పటికీ గత మూడేళ్లలో కేవలం పెరిగిన డీజిల్ ధరలతో ఆర్టీసీపై రూ. 660 కోట్లు భారం పడింది. తాజాగా కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో అదనంగా డీజిల్ కొనుగోలుకే ఆర్టీసీపై మరో రూ. 80కోట్లు అదనపు భారం పడటంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు.