బిజినెస్

పన్ను భయాలు ఇక అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: దేశంలోని స్టార్టప్ కమ్యూనిటి ఇకనుంచి ఆదాయపు పన్ను అధికారుల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ‘ఏంజెల్ ట్యాక్స్’ గురించిన ఆందోళనలు పరిష్కారం అయినందున వారు తమ వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ పీసీ మోదీ పేర్కొన్నారు. స్టార్టప్‌లకు సంబంధించిన అన్ని వీలునామా ఆస్తుల అంశాలు సంప్రదింపుల ప్రక్రియ ద్వారా పరిష్కరించడం జరుగుతుందని ఆయన శనివారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ట్యాక్స్ అథారిటికి చెందిన సీనియర్ అధికారుల గట్టి పర్యవేక్షణలో ఈ సంప్రదింపుల ప్రక్రియ జరుగుతుందని ఆయన వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అనేక చర్యలు ప్రతిపాదించారు. ఈ చర్యల సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని సీబీడీటీ చీఫ్ ఈ విషయం వెల్లడించారు.