బిజినెస్

రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: రానున్న పదేళ్ళ కాలంలో రైల్వేలకు 50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకుని రావడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రైల్వే మంత్రి పియూష్ గోయల్ శనివారం నాడిక్కడ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా రైల్వేలను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. గత 65 ఏళ్ళ కాలంలో సరైన పెట్టుబడులు లేకపోవడం వల్ల దేశంలో వౌలిక సదుపాయాలు కేవలం 30 శాతం మాత్రమే విస్తరించాయని ఆయన అన్నారు. రానున్న పదేళ్ళ కాలంలో 50 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా తీసుకుని రావడం ద్వారా రైల్వే వ్యవస్థను అన్ని విధాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రయాణికుల భద్రత, నెట్ వర్క్‌ల విస్తరణ, సరుకులు రవాణా పరిమాణాన్ని పెంచుకోవడం సహా అన్ని అంశాలపై దృష్టి పెడతామని తెలిపారు. 2019-20 వార్షిక బడ్జెట్‌లో రైల్వేలకు జరిపిన కేటాయింపులపై మాట్లాడిన ఆయన మొదటి నుంచి కూడా రైల్వేలో పెట్టుబడులు నత్తనడకగానే సాగుతూ వస్తున్నాయని వెల్లడించారు. ఈ 65 ఏళ్ళ కాలంలో ప్రయాణికుల పరిమాణం 1500 రేట్లు పెరిగినా, రైల్వేల అభివృద్ధికి సంబంధించిన వౌలిక సదుపాయాలు మాత్రం 30 శాతం విస్తరించాయని, దీని కారణంగానే అనేక రకాలుగా వౌలిక సమస్యలు ఎదురవుతున్నాయని గోయల్ స్పష్టం చేశారు.

చిత్రం... రైల్వే మంత్రి పీయూష్ గోయల్