బిజినెస్

కేంద్రానికి అదనపు ఆదాయం 30వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: అతి సంపన్న వర్గాలపై పన్నులను పెంచడం, పెట్రోలు, డీజిల్‌పై సుంకాలను పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది అదనంగా రూ.30 వేల కోట్ల ఆదాయం సమకూరనుందని రెవెన్యూ కార్యదర్శి అజయ్‌భూషణ్ పాండే తెలిపారు. అలాగే బంగారంతోబాటు ఇతర విలాస లోహాలపై సుంకాలను పెంచడంతోబాటు, ఉన్నత సంపన్న వర్గాలపై అధిక సర్‌చార్జీలు విధించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం మరింతగా పెరుతుందని ఆయన చెప్పారు. ఐతే కార్పొరేట్ పన్నుల్లో రాయితీల వల్ల ఆదాయంలో తగ్గుదల నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. రూ. 250 కోట్ల టర్నోవర్ ఉన్న పరిశ్రమలకే గతంలో 25 శాతం పన్ను రాయితీ ఉండేదని, ప్రస్తుతం ఆ పరిమితిని రూ. 400 టర్నోవర్‌కు పెంచడం జరిగిందని ఆయన వెల్లడించారు. కాగా పెట్రోలు, డీజిల్ రవాణాపై రోడ్ సెస్సును పెంచడంతోబాటు, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని పెంచడం వల్ల రూ. 30 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు పాండే చెప్పారు. ఇలావుండగా ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలివున్న తొమ్మిది నెలల కు పన్నుల ద్వారా 22వేల కోట్ల రూపాయల ఆదా యం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో ఉన్నత సంపన్న వర్గాలపై విధించిన సర్‌చార్జి ద్వారా 12వేల నుంచి 13 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అం చనా. కాగా రెండు నుంచి ఐదు కోట్ల వరకు ఉన్న ఆదాయంపై సర్‌చార్జిని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచడంతోబాటు, ఐదు కోట్ల పైబడిన ఆదాయంపై 37 శాతం సర్‌చార్జిని విధించాలని తాజా బడ్జెట్‌లోప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దేశీయ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేట్లను 99.3 శాతం పెంచడం వల్ల ఈ వార్షికాదాయం 4000 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.
ఇక బంగారం, ఇతర విలాస లోహాలపై సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం వల్ల మరో మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఐతే పలు ఇతర వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం వల్ల స్థూల ఆదాయంలో తగ్గుదల నెలకొంటుందని పాండే వివరించారు.