బిజినెస్

ప్రత్యేక తరహా బాండ్ల ద్వారా విదేశీ నిధుల సమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: విదేశీ మార్కెట్లలో ప్రత్యేక తరహా బాండ్లు (సావరిన్ బాండ్స్) జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఆదివారం నాడిక్కడ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ బాండ్లను జారీ చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ‘స్థూల నిధుల సమీకరణలో కొంత భాగం విదేశీ మార్కెట్ల నుంచి, విదేశీ మారక ద్రవ్యం ద్వారా కూడా జరుగుతుంద’ని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయాన్ని గార్గ్ గుర్తు చేశారు. మనదేశ విదేశీ రుణాల శాతం కూడా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) స్థాయికంటే తక్కువగా 5 శాతంగానే ఉందని, అన్ని ఇతర దేశాల్లోకి ఇదే అత్యంత కనిష్ట స్థాయి అని నిర్మల వ్యాఖ్యానించడం జరిగిందన్నారు. కాగా తాజాగా జరిగిన బాండ్ల జారీ నిర్ణయంతో ఈ జారీ ఏ పరిమాణంలో ఉండాలన్న ప్రశ్న ఉత్పన్నమైంది.
అందుకే ప్రస్తుతం దీనిపై స్పష్టతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గార్గ్ పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో వివరించారు. ఈ విషయంలోప్రభుత్వం త్వరలో ఒక సలహా కమిటీని ఏర్పాటు చేస్తుందని, ఏ మేరకు విదేశీ నిధులు సమీకరించాలన్న విషయంపై ఆ కమిటీ స్పష్టతను ఇస్తుందని ఆయన తెలిపారు. విదేశీ మారక ద్రవ్యం ద్వారా వీలైనంత అధిక నిధులు సమీకరించాలన్న దృక్పథం ప్రభుత్వానికి ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే తొలి ఇస్యూను చేపట్టాలన్న లక్ష్యం ఉందన్నారు. వచ్చే సెప్టెంబర్ చివరి వారానికల్లా ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌కు రూపకల్పన జరుగుతుందని తెలిపారు. విదేశీ మార్కెట్ల నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరంలో 4.48 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. గత ఏడాది రూ. 4.22 లక్షల కోట్ల నిధులను ఈ దిశలో సమీకరించడం జరిగిందన్నారు. నికర నిధుల సమీకరణ లక్ష్యాన్ని సైతం 5.71 లక్షల కోట్ల నుంచి 7.1 లక్షల కోట్లకు పెంచడం జరిగిందని సుభాష్‌చంద్ర గార్గ్ వివరించారు. ఈ ఏడాది ప్రథమార్థంలోనే రూ. 4.42 లక్షల కోట్ల నికర నిధుల సమీకరణ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు.