బిజినెస్

సమస్యగా మారిన మిగులు చక్కెర ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, జూలై 7: చక్కెర ఉత్పత్తి మిగులుతుండడం దేశానికి పెద్ద సమస్యగా మారిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కాబట్టి చక్కెర ఉత్పత్తిదారులు ఇథనాల్ వైపు దృష్టి మరల్చాలన్నారు. మహారాష్ట్ర రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ ఆదివారం నిర్వహించిన చక్కెర సదస్సు-2020కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ ప్రసంగిస్తూ ప్రస్తుతం దేశంలో చక్కెర ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. నిజం చెప్పాలంటే చక్కెర ఉత్పత్తి పెరగడం వల్ల ఉత్పత్తిదారులకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. రానున్న రోజుల్లో ఇథనాల్‌కే భవిష్యత్తు ఉంది కాబట్టి చక్కెర ఉత్పత్తి చేసే పరిశ్రమల యజమానులు ఆ దిశగా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. ఇథనాల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించనున్నదని, ఇంకా పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా ఇథనాల్‌ను ఖరీదు చేయనున్నదని ఆయన వివరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రసంగిస్తూ చక్కెర పరిశ్రమలకు తమ ప్రభుత్వం చేయూతనందిస్తుందని చెప్పారు.