బిజినెస్

ఆర్టీసీ కార్గోకు ఆధునిక సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: ఏపీఎస్ ఆర్టీసీ ఆధునిక విధానంలో బలోపేతమవుతోంది. రోజు రోజుకూ ఈ వ్యవస్థ విస్తరిస్తోంది. ఆర్టీసీ విజయనగరం జోన్‌లో గణనీయమైన ఆదాయం సాధించే దిశగా ఆర్టీసీ కార్గో విస్తరణ జరిగింది. కార్గో పటిష్టవంతంగా నిర్వహిస్తుండటంతో ఆఖరికి పాఠ్య పుస్తకాలు కూడా ఆర్టీసీ కార్గోలో రవాణా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి దిశగా ఆర్టీసీ కార్గో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నమ్మకాన్ని మరింత పెంపొందించుకుంటూ ఆదాయాన్ని సాధిస్తోంది.
ఏపీఎస్ ఆర్టీసీలో 2016లో సొంతంగా కార్గో నిర్వహణకు శ్రీకారం చుట్టింది. మొదట ఏడాది పాటు గెలాక్సీ అనే సంస్థ కార్గోను నిర్వహించింది. అనంతరం 2017 నుంచి 2019 జూన్ 30వ తేదీ వరకు రెండేళ్ల కాలపరిమితి పూర్తికావడంతో ఇపుడు జూలై ఒకటో తేదీ నుంచి ఫెర్‌సెప్ట్ ఇన్ఫోసెల్ అనే విజయవాడకు చెందిన కంపెనీ కార్గో బాధ్యతలు చేపట్టింది. ఈ సంస్థకు మూడేళ్లపాటు అంటే 2022 వరకు టెండరు దక్కించుకుంది. కార్గో నిర్వహించేందుకు ఈ సంస్థకు 10 శాతం కమిషన్ ప్రాతిపదికన కేటాయించారు. ఈ సంస్థ తెలంగాణాలో హైదరాబాద్, ఏపీ రాష్టమ్రంతా ఈ ఆర్టీసీ కార్గో సేవలు విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి దిశగా ఆర్టీసీ కార్గో బుకింగ్ కేంద్రాలు కేటాయించడం సత్ఫలితాలనిస్తోంది. రూ.1000 రిఫండబుల్ డిపాజిట్‌గా స్వీకరించి గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో రూ.6వేలు రిఫండబుల్ డిపాజిట్ చెల్లించుకుని ఆర్టీసీ కార్గో బుకింగ్ సెంటర్లను కేటాయిస్తున్నారు. ఈ సెంటర్ల నిర్వహణలో కార్గో లావాదేవీలపై 15 శాతం కమిషన్ చెల్లిస్తున్నారు. ప్రస్తుతం రాష్టమ్రంతా ఈ కార్గో సెంటర్లను విస్తరిస్తున్నారు. ఎక్కడ నుంచి ఎక్కడికైనా సరఫరా చేసే విధంగా ఏపీ పరిధిలో పెద్ద ఎత్తున కార్గో కార్యకలాపాలను ఆధునిక విధానంలో నిర్వహిస్తున్నారు. వినియోగదారుడు ఇచ్చిన పార్సిల్ చేరాల్సిన గమ్యస్థానం వరకు ముందుగానే సమయం కూడా చెప్పగలుతున్నారు. పెద్ద పెద్ద డిపోల్లో అయితే కార్గో ఎగుమతి, దిగుమతి విభాగాలను విడి విడిగా నిర్వహిస్తున్నారు. జవాబుదారితనంతో కార్గో సమర్ధవంతంగా నిర్వహిస్తుండటంతో విశ్వసనీయత పెరిగి రోజు రోజుకీ ఆర్టీసీ కార్గో పెరుగుతోంది.
రాష్ట్ర విభజన అనంతరం నేపధ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీలో ఈ వ్యవస్థ పెద్ద ఎత్తున ఆదాయాన్ని సముపార్జించే వనరుగా మారింది. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో 49 మండలాల్లో కార్గో బుకింగ్ ఏజెంట్ల నియామకం జరిగింది. ఇదే విధంగా అన్ని మండల కేంద్రాల్లోనూ ఏపీఎస్ ఆర్టీసీ కార్గో బుకింగ్ సెంటర్లను విస్తరిస్తున్నారు. తాజాగా డోర్ డెలివరీ విధానాన్ని కూడా ప్రవేశ పెట్టారు. అదే విధంగా పార్సిల్ డెలివరీ ఇచ్చేటపుడు కూడా ఛార్జీ వసూలు చేసే టూ పే విధానాన్ని కూడా ప్రవేశ పెట్టారు. ఉదాహరణకు జిల్లాలో అవసరమైన 23 లక్షల పాఠ్య పుస్తకాలను కూడా ఆర్టీసీ కార్గోలో రవాణా చేసి జిల్లాలోని 64 మండలాలకు పంపిణీ చేసినట్టు డిఈఓ అబ్రహాం చెప్పారు. యూనిఫారాలు కూడా ఆర్టీసీ కార్గోలోనే అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు.
ఆర్టీసీ కార్గో ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఆర్టీసీ రీజియన్ రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోలో కొత్తగా మరో రెండు కౌంటర్లు పెట్టారు. విజయనగరం ఆర్టీసీ జోన్‌లో ఫెర్‌సెప్ట్ అనే సంస్థలో 104మంది సిబ్బంది సేవలు అందిస్తున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ కార్గో విభాగం మేనేజర్ కె రమేష్ చెప్పారు. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో రూ.5.50 కోట్లు ఆదాయం లభించగా 2018-19లో 8.91 కోట్లు వచ్చిందని, 2019-20లో రూ.15 కోట్లు ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రీజినల్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి చెప్పారు.