బిజినెస్

స్టాక్ మార్కెట్ ఢమాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: 3స్టాక్ మార్కెట్లలో తుపాను ముందటి ప్రశాంతత కనిపిస్తోంద2ని బడ్జెట్‌కు ముందు వెలువడిన విశే్లషకుల అంచనాలు నిజమయ్యాయి. సోమవారం స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోగా రూ.3.39 లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఊహించిన స్థాయిలో కేంద్ర బడ్జెట్ లేకపోవడంతోబాటు అంతర్జాతీయ మార్కెట్లలో పెద్దమొత్తాల్లో వాటాల విక్రయాలు జరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు నమోదు చేశాయి. బీఎస్‌ఈలో 30 షేర్ల సెనె్సక్స్ ఏకంగా 792.82 పాయింట్లు కోల్పోయి 2.1 శాతం నష్టాలతో 38,720.57 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఒక దశలో ఈ సూచీ 907.91 దిగువకు చేరి మదుపర్లను షాక్‌కు గురిచేసింది. బీఎస్‌ఈ జాబితాలోని కంపెనీల మార్కెట్ వౌలిక విలువ (మార్కెట్ కేపిటలైజేషన్) రూ. 3,39,192.97 కోట్ల నుంచి ఒక్కసారిగా రూ. 1,47,96,302.89 కోట్లకు పడిపోయింది.
గడచిన రెండు రోజులుగా బీఎస్‌ఈ జాబితాలోని కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 5,61,772.64 కోట్లకు పెరిగింది. గత శుక్రవారం వాణిజ్య వారం చివరి రోజున సెనె్సక్స్ 394.67 పాయింట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. కాగా తాజా నష్టాలకు అటు దేశీయ ప్రతికూలతలతోబాటు అంతర్జాతీయ పరిస్థితులు కారణమని మార్కెట్ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఫెడరల్ రేట్ల కోత తో మూల వేతనాల్లో పెరుగుదల ఉంటుందని ఆశించిన వారికి అలాంటి రేట్ల కోత ఏదీ జరగకపోవడంతో అంతటా ఆందోళన నెలకొంది. ఇక దేశీయంగా కేంద్ర బడ్జెట్‌లో కంపెనీల్లో ప్రజల కనీస వాటాలను 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపిందని నిపుణులు అంటున్నారు. అలాగే వాటాలను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేసుకోవడానికి 20 శాతం పన్ను చెల్లింపులు చేయాలన్న నిబంధన విధించడంపై సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కాగా బీఎస్‌ఈలో సెనె్సక్స్ ప్యాక్‌లో మొత్తం 27 కంపెనీలు సోమవారం అమ్మకాల వత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రత్యేకించి బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, హీరోమోటోకార్ప్, మారుతీ సుజుకీ ఇండియా అతిపెద్ద స్థాయిలో నష్టాలపాలయ్యాయి. బీఎస్‌ఈలో 1,953 వాటాలు నష్టపోగా 571 వాటాల విలువ పెరిగింది. 145 వాటాల్లో ఎలాంటి మార్పూలేదు. ట్రేడింగ్ ఆరంభమైనప్పటి నుంచి ఏ దశలోనూ మార్కెట్లు కోలుకోలేదు. క్రమంగా నష్టాల తీవ్రత పెరుగుతూ వచ్చింది. ఇలావుండగా కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేకపోవడంతోబాటు రుతుపవనాల ప్రభావం సైతం చాలా బలహీనంగా ఉండటం, అంతర్జాతీయంగా భారీగా వాటాల విక్రయాలు జరగడంతో మదుపర్లు ముందు జాగ్రత్తగా దేశీయంగానూ వాటాల విక్రయాలకు దిగారని విశే్లషకులు భావిస్తున్నారు.
మొత్తం 1,174 లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటాల శాతాన్ని 25 శాతం 35 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో దిగ్గజ కంపెనీలు టీసీఎస్, విప్రో, డీమార్ట్ తదితరాలున్నాయి. మంత్రి ప్రకటన నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లలో ఆరంభమైన తీవ్ర కుదుపు సోమవారం భారీ నష్టాల స్థాయికి చేరింది. బీఎస్‌ఈలో కేపిటల్ గూడ్స్, స్థిరాస్తి, ఆటోమొబైల్, విద్యుత్, పారిశ్రామిక, ఫైనాన్స్, బ్యాంకింగ్ సూచీలు 3.74 శాతం నష్టపోయాయి. ఇక బ్రాడర్ మార్కెట్‌లో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సైతం 2.46 శాతం నష్టపోయాయి.