బిజినెస్

సెల్‌ఫోన్ల విక్రయాల్లో టాప్-3 దేశాల సరసన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: తమ సెల్‌ఫోన్ ఉత్పత్తులకు ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల సరసన త్వరలో భారత్ కూడా చేరనుందని చైనా ఫోన్‌ల తయారీ సంస్థ ట్రాన్షన్ హోల్డింగ్స్ వెల్లడించింది. ఇప్పటికే భారతీయ మార్కెట్ నుంచి ట్రాన్షన్ కంపెనీ సెల్‌ఫోన్ ఉత్పత్తులకు విపరీతమైన మార్కెట్ ఉంది. తమ ఉత్పత్తులకు డిమాండ్ ఉన్న టాప్ 3 దేశాల్లో ఒకటిగా భారత్ మారబోతోందన్న ఆశాభావాన్ని ట్రాన్షన్ కంపెనీ ఇండియా సీఈవో అర్జీత్ తలపాత్ర బుధవారం ఢిల్లీలో విలేఖరులకు చెప్పారు. ట్రాన్షన్ సంస్థ నుంచి టెక్నో, ఇన్‌ఫినిక్స్, ఐటెల్ బ్రాండ్‌కు భారత మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో ట్రాన్షన్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌కు భారత్ నుంచి విపరీతమైన స్పందన లభిస్తోందనీ.. ఇప్పటికే భారత్ ఈ అంశంలో భారత్ నాలుగో స్థానంలో ఉందని తలపాత్ర పేర్కొన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో తమ ఉత్పత్తులకు బాగా డిమాండ్ ఉన్న దేశాల్లో భారత్ టాప్-3లో ఒకటి కానుందని ఆయన వెల్లడించారు. తమ ఫోన్లకు నైజీరియా, కెన్యాల నుంచి విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పారు. ఆప్రికా, మధ్య ప్రాచ్య దేశాలకు ఇటీవలే ఎగుమతులను ప్రారంభించినట్లు చెప్పారు. భారత్‌లో ఇప్పటికే తమ సంస్థ తరఫున రెండు యూనిట్లు ఉన్నాయనీ.. ఇవి ఏటా 20 మిలియన్ల ఫీచర్ ఫోన్‌లు, పది మిలియన్ల స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్నట్లు తలాపాత్ర చెప్పారు. భారత్‌లో ఆన్‌లైన్ మార్కెట్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని వివరించారు. ఎనిమిది వేల రూపాయిల లోపు, 12 వేల రూపాయిల పై రేంజ్‌లలో ఫాంటం 9 ఉత్పత్తులను విక్రయిస్తున్నామని చెప్పారు. మెట్రో నగరాల నుంచి టెక్నో ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇందులో 2017 జూలై నుంచి 14,999 రూపాయిలకు 6.4 అంగుల డిస్‌ప్లేతో 6జీబీ రామ్, 128 జీబీ ఇంటర్నల్ (256 జీబీ ఎక్స్‌పాండబుల్)తో పాటు 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 ఎంపీ+8ఎంపీ+2ఎంపీ వెనుక కెమెరాలతో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 3,500 ఎంఏహెచ్ బ్యాటరీల సదుపాయంతో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ సదుపాయం కూడా ఇందులో ఉందని వివరించారు.