బిజినెస్

మళ్లీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 10: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్లీ నష్టాల పాలయ్యా యి. ప్రధానంగా చమురు, సహజ వాయులు, లోహ, వాహన రంగాలు అత్యధికంగా నష్టపోయాయి. గత శుక్రవారం నుంచి వరసగా రెండు రోజులపాటు భారీగా నష్టపోయిన సూచీలు మంగళవారం స్వల్పంగా కోలుకున్నప్పటికీ బుధవారం మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఆరంభంలో 400 పాయింట్లు ఎగబాకిన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు గురై వేగంగా నష్టాల్లోకి జారింది. మొత్తం 173.78 పాయింట్లు కోల్పోయిన ఈ సూచీ 0.45 శాతం నష్టాలతో 38,557.04 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇక ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ వరుసగా నాలుగో రోజు నష్టాలను నమోదు చేసింది. ఈ సూచీ బుధవారం 57 పాయింట్లు కోల్పోయి 0.49 శాతం నష్టాలతో 11,498.90 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ తీవ్ర అనిశ్చితికి గురైంది. ఒక దశలో 11,498.90 పాయింట్ల కనిష్టాన్ని, మరోదశలో 11,593.70 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 4.91 శాతం నష్టాలను మూటగట్టుకుంది. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 1.16 శాతం నష్టాల పాలైంది. ఈ కంపెనీ గత జూన్ నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసినప్పటికీ నష్ట నివారణ జరగలేదు. ఇక టాటా స్టీల్, టాటా మోటార్స్, ఆక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హీరోమోటోకార్ప్, ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ సైతం 2.94 శాతం నష్టపోయాయి. ఇలావుండగా గడచిన జూన్ మాసంలో అన్ని కేటగిరీల వాహనాల విక్రయాలు తగ్గాయని భారత వాహనాల తయారీదారుల సొసైటీ (ఎస్‌ఐఏఎం) ప్రకటించడంతో వాహన రంగ స్టాక్స్‌పై ప్రభావం పడిందని వాణిజ్య రంగ విశే్లషకులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎస్ బ్యాంక్, సన్‌పార్మా, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ మొత్తం వారం మార్కెట్ ట్రెండ్‌కు భిన్నంగా బుధవారం సైతం 1.81 శాతం లాభాలను సంతరించుకున్నాయి.
ట్రంప్ వ్యాఖ్యలతోప్రతికూలతలు
అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు అధికంగా ఉన్నాయని, వెంటనే వాటిని తగ్గించాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేశాయని, ప్రధానంగా మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపి వాణిజ్య పరమైన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఒడంబడిక చేసుకున్న ట్రంప్ మళ్లీ తన పాత వైఖరిని ప్రదర్శించడం విశేషం. ‘్భరత్ సుంకాలను దీర్ఘకాలం భరించలేం’ అంటూ వ్యాఖ్యానించడం వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వారంలోనే వాషింగ్టన్ డీసీలో అమెరికన్ వాణిజ్య శాఖ కార్యదర్శి విల్‌బర్ రోస్, విద్యుత్ శాఖ కార్యదర్శి రిక్‌పెర్రీలు భారత్‌కు చెందిన ఓ అతిపెద్ద సదస్సులో పాల్గొని ప్రసంగించాల్సివుంది.