బిజినెస్

జూన్‌లో ఎల్‌ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం ద్విగుణీకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) నేతృత్వంలోని కొత్త బీమా ప్రీమియం ఆదాయం గడచిన జూన్ మాసంలో 94 శాతం వృద్ధి చెందింది. దీంతో ఈ రంగంలో ఉన్న బీమా సంస్ధల మొత్తం ఆదాయం ఆ నెలలో రూ. 32,241.33 కోట్లుగా నమోదైంది. ఈ విషయాలను జీవిత బీమా నియంత్రణ, అభివృద్థి విభాగం చేసిన అధ్యయనానికి సంబంధించిన నివేదిక వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో మొత్తం 24 జీవిత బీమా సంస్థలు స్థూలంగా రూ. 16,611.57 కోట్ల ఆదాయాన్ని గడించాయి. కాగా దేశంలో అతిపెద్ద జీవితబీమా సంస్థగా సాగుతున్న ఎల్‌ఐసీ ఒక్కటే ప్రభుత్వ రంగ సంస్థ జూన్‌లో దాదాపు ద్విగుణీకృత ఆదాయం రూ. 26,030.16 కోట్ల మొత్తాన్ని కొత్త ప్రీమియం ద్వారా ఆర్జించిందని నివేదిక తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో ఈ ఆదాయం రూ. 11,167.82 కోట్లుగా ఉందని వివరించింది. ఇలా వాణిజ్యంలో గణనీయ వృద్ధిని సాధించడం ద్వారా ఈ సంస్థ మార్కెట్ షేర్ 74 శాతం పెరిగింది. మిగిలిన 26 శాతాన్ని 23 ప్రైవేటు రంగ బీమా సంస్థలు సంతరించుకున్నాయని ఆ నివేదిక తెలిపింది. జూన్ నెలలో ఎల్‌ఐసీ మొత్తం 13,32 లక్షల పాలసీలను విక్రయించడం ద్వారా రూ. 25,000 కోట్ల ఆర్జించింది. ప్రైవేటు రంగ బీమా సంస్థలు సైతం ఆ నెలలో కొత్త ఏడాది వ్యాపార ప్రీమియం ద్వారా రూ. 6,211.17 కోట్ల రూపాయలు ఆర్జించి 14.0 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ సంస్థలు రూ. 5,443.75 కోట్లను ఆర్జించాయి. ప్రత్యేకించి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కొత్త ప్రీమియం ఇయర్ బై ఇయర్ విధానంలో 21 శాతం పెరిగి మొత్తం రూ. 1,358.45 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ లైఫ్ సైతం 28.14 శాతం వృద్ధితో రూ. 1,319.07 కోట్లు ఆర్జించింది. అలాగే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ 26 శాతం వృద్ధితో రూ. 897.98 కోట్లు, బజాజ్ అలియాన్జ్ 51 శాతం వృద్ధితో రూ. 421.87 కోట్లు, కోటక్ మహీద్రా లైఫ్ 8 శాతం వృద్ధితో రూ. 291.89 కోట్లు, టాటా ఏఐఏ లైఫ్ 90/26 శాతం వృద్ధితో రూ. 258.95 కోట్లు, రిలయన్స్ నిప్పాన్ లైఫ్ 6.84 శాతం వృద్ధితో రూ. 66.81 కోట్లు గడించాయని నివేదిక తెలిపింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎల్‌ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం 82 శాతం వృద్ధితో మొత్తం రూ. 44,794.78 కోట్లు ఆర్జించిందని వివరించింది.