బిజినెస్

అంధులు సైతం గుర్తించేలా.. కరెన్సీ నోట్లకు ప్రత్యేక యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: కంటిచూపు తక్కువగా ఉండేవారు, గుడ్డివారు సైతం కరెన్సీ నోట్లను సులభంగా గుర్తించగలిగేలా ఓ మొబైల్ అప్లికేషన్‌ను రిజర్వు బ్యాంక్ త్వరలో తీసుకురానుంది. ఈ ప్రత్యేక యాప్ తయారీ కోసం సాంకేతిక రంగానికి చెందిన సంస్థల నుంచి బిడ్లు ఆహానించింది. డిజిట ల్ లావాదేవీలను ప్రభుత్వం ఎంతగా ప్రోత్సహిస్తున్నప్పటికీ ఇప్పటికీ కరెన్సీ నోట్ల ద్వారానే అధిక శాతం లావాదేవీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 10, 20, 50, 100, 200, 500, 2000 రూపాయల డినామినేషన్లలో బ్యాంకుల్లో కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఐతే ధన రూ పేణా జరుగుతున్న లావాదేవీల్లో కరెన్సీ నోట్లను గుర్తించడం పెద్ద సవాలుగా మారిందని, ప్రత్యేకించి కంటి చూపు తక్కువగా ఉన్న వారు రూ. 100 అంతకంటే ఎక్కువ డినామినేషన్ల నోట్లను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్బీఐ గుర్తించింది. 2016 నవంబర్‌లో రూ. 500, 1000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కొత్త డిజె న్లు, సైజుల్లో కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే కంటిచూపు త క్కువగా ఉన్నవారి కోసం మొబైల్ యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టామని సెంట్రల్ బ్యాంకు పేర్కొంది. ఈ యాప్ ప్రత్యేకించి మహాత్మా గాంధీ సిరీస్‌లోని పాత, కొత్త నోట్లను గుర్తించడం జరుగుతుందని, మొబైల్ కెమెరా ముందుంచిన నోట్ల ఫొ టోలు తీయడం ద్వారా అవి ఏ డినామినేషన్‌కు సం బంధించినవో తెలుస్తుందని ఆర్బీఐ తెలిపింది. అ లాగే ఫొటోపై ఆడియో నో టిఫికేషన్2 సైతం జరగుతుందని తద్వారా వినియోగదారుడికి అది నోట్ అన్నది వెల్లడవుతుందని పేర్కొంది. ఒక వేళ ఫొటో సరిగా లేకపోతే 3మళ్లీ ప్రయిత్నించండి అని వినిపిస్తుందని వివరించిం ది. ప్రస్తుతం మనదేశంలో సుమారు 80 లక్షల మంది కంటిచూపు సరిగాలేనివారు. గుడ్డివారు ఉన్నారు. వీరందరికీ ఈ యాప్ ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆర్బీఐ తెలిపింది.