బిజినెస్

అతి కనిష్ట స్థాయిలో దేశ వాణిజ్య సెంటిమెంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : మన దేశంలో వాణిజ్య సెంటిమెంటు 2016 నుంచి అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. ప్రధానంగా దేశ ఆర్థిక స్థితి మందగించడం, ప్రభుత్వ విధాన నిర్ణయాలు, నీటి కొరత వంటి కారణాలతో కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయని సోమవారం నాడిక్కడ విడుదలైన ‘ఐహెచ్‌ఎస్ మార్కెట్ ఇండియా బిజినెస్ అవుట్‌లుక్’ సంస్థ నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. తాజాగా ఉద్యోగ నియామకాలు, మూలధన వ్యయానికి సంబంధించి సహేతుకమైన సున్నితమైన విధానాన్ని అనుసరించడం వల్ల భవిష్యత్తులో లాభాల్లో వృద్ధి చోటుచేసుకునే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. ప్రైవేటు కంపెనీల నికర మూలధన నిల్వల విధానం సైతం మాసవారీ వృద్ధిలో తరుగుదలకు కారణం అవుతోందని గత ఫిబ్రవరిలో 18 శాతం ఉన్న ఈ వృద్ధిరేటు 15 శాతానికి తగ్గిందని నివేదించింది. ప్రత్యేకించి అందుబాటులో ఉన్న గణాంకాలను అనుసరించి గడచిన జూన్ మాసంలో మనదేశంలో వాణిజ్య సెంటిమెంటు అతి స్వల్ప స్థాయికి చేరింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, నీటి కొరత, విక్రయాల్లో నెలకొన్న తగ్గుదల వాణిజ్య సెంటిమెంటును దెబ్బతీశాయని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ తరచూ బలహీనపడటం వల్ల దిగుమతి చేసుకునే పరికరాల ధరలు పెరిగుతుండటం దేశీయంగా వాణిజ్యాభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. అలాగే నిపుణులైన కార్మికుల కొరత, పన్నుల పెంపు, ఆర్థిక నష్టాలతోబాటు వినియోగదారులు సైతం అధికంగా డిస్కౌంట్లు డిమాండ్ చేస్తుండటం కూడా వాణిజ్య రంగ విస్తరణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని నివేదిక వెల్లడించింది. కంపెనీ నియంత్రణ చట్టాలు సైతం ప్రోత్సాహకంగా లేదని కొంతమంది వ్యాపారవేత్తలు అభిప్రాయపడ్డారని ‘ఐహెచ్‌ఎస్ మార్కెట్’ ప్రిన్సిపుల్ ఎకానమిస్ట్ పోల్యన్నా డీ లిమా తెలిపారు. ఇలావుండగా రాబోయే ఏడాది మాత్రం ప్రభుత్వం చేపట్టిన వాణిజ్యాభివృద్థి విధానాల కారణంగా పెరుగుతున్న పెట్టుబడుల వల్ల గణనీయమైన వృద్ధి చోటుచేసుకుంటుందని ఆమె తెలిపారు. భవిష్యత్తులో తమ వాణిజ్యానికి డిమాండ్ పెరుగుతుందని కంపెనీల్లో నమ్మకం ఏర్పడుతున్న కారణంగా అదనంగా ఉద్యోగ నియామకాలను చేపట్టడంతోబాటు వ్యాపార విస్తరణ సైతం చేపట్టే అవకాశాలున్నాయని లిమా చెప్పారు. మొత్తం 12వేల తయారీ దార్లు, సర్వీస్ ప్రొవైడర్ల అభిప్రాయలను పరిగణనలోకి తీసుకుని తమ అధ్యయన నివేదికను రూపొందించడం జరిగిందని, మూడేళ్లకోమారు వెలువడిన కంపెనీలు, వ్యాపార సంస్థల ఫలితాలను సైతం బేరీజు వేశామని ఆమె చెప్పారు.