బిజినెస్

రెండో రోజూ లాభాల్లో సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 16: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్ బ్యాంకు, లార్సన్ అండ్ టర్బో, ఇన్ఫోసిస్ లాభాల పంటతో దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో వరుసగా రెండో రోజైన మంగళవారం సూచీలు లాభాలను నమోదు చేశాయి. బీఎస్‌సీలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 234 పాయింట్ల ఆధిక్యతతో 39,131.04 పాయింట్ల గరిష్ట స్ధాయిలో స్థిరపడింది. తొలుత 329 పాయింట్లు ఎగబాకిన ఈ సూచీ ఇంట్రాడేలో ఒక దశలో 39.173.89 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 38,845.27 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌సీ సూచీ నిఫ్టీ సైతం 72.70 పాయింట్ల ఆధిక్యతతో 0.63 శాతం లాభాలతో 11,661.05 పాయింట్ల గరిష్ట స్ధాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ తొలుత 11,670.05 పాయింట్ల గరిష్టాన్ని, తర్వాత 11,573.95 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. సెనె్సక్స్ ప్యాక్‌లో ఎస్ బ్యాంక్ భారీ స్ధాయిలో 11.48 శాతం లాభాలను అందుకుంది. ఈ ప్రైవేటు బ్యాంకులో అధిక శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్ధ ముందుకు వచ్చిందన్న వార్తలతో స్టాక్ మార్కెట్లో వాటాల కొనుగోళ్లు ఊపందుకున్నట్టు మార్కెట్ విశే్లషకులు పేర్కొన్నారు. అలాగే టాటా మోటార్స్ సైతం 5.53 శాతం లాభపడింది. ఈ సంస్థకు చెందిన బ్రిటీష్ బ్రాండ్ జేఎల్‌ఆర్ ఇంగ్లాండ్ ప్రభుత్వం నుంచి రుణం పొందేందుకు హామీని పొందిందని వార్తలు వెలువడటంతో ఈ సంస్థ వాటాలు సైతం అధిక స్ధాయిలో లాభపడ్డాయి. కాగా సన్‌పార్మా, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, టాటాస్టీల్, ఆక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, ఆర్‌ఐఎల్, ఎస్‌బీఐ సైతం 5.53 శాతం అధిక లాభాలను సంతరించుకున్నాయి. త్రైమాసికి ఫలితాలతో ఆకట్టుకున్న ఇన్ఫోసిస్ వరుసగా రెండో రోజు 0.71 శాతం లాభపడింది. ఇలావుండగా మరోవైపు టీసీఎస్, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, టెక్‌మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.86 శాతం నష్టపోయాయి. ఆర్జన సీజన్‌లోకి ఆడుగిడటంతో దేశీయ మార్కెట్లు లాభాల బాటలోకి మళ్లాయని ప్రముఖ విశే్లషకుడు సునిల్ శర్మ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా వడ్డీ రేట్లు తగ్గించడం, ద్రవ్య లభ్యత పెరగడంతోబాటు ఆర్థికంగా వత్తిడులను ఎదుర్కొంటున్న కొన్ని భారీ సంస్ధల పునరుద్ధరణ జరుగబోతోందన్న వార్తలు మార్కెట్లకు సానుకూలంగా మారాయని ఆయన వివరించారు. ఐతే బాండ్ల ద్వారా వచ్చే లాభాలు వరుసగా ఐదోరోజు 6.34 శాతంగా ఉంది. అంటే ఇది తదుపరి ఆర్‌బీఐ రేట్ల కోత స్థాయికంటే 2.5 శాతం తక్కువగా ఉండటం ఆందోళనకరం. ఈ ఏడాది ఇప్పటికే రిజర్వు బ్యాంక్ ఆఫ్ మూడు సార్లు రెపోరేట్ల కోత విధించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఆరంభం నుంచే బాండ్లపై లాభాలు ఒక శాతానికిపైగా తగ్గుముఖం పట్టాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
తగ్గిన రూపాయి విలువ
అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం 10 పైసలు తగ్గి మొతం 68.65 రూపాయలుగా ట్రేడైంది. ఐతే ముడి చమురు ధరలు మాత్రం 0.36 శాతం పెరిగి బ్యారెల్ 66.72 డాలర్ల వంతున అమ్మకాలు, విక్రయాలు జరిగాయి. ఇక ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే షాంఘై కాంపోజిట్ సూచీ, నిక్కీ లాభాలను నమోదు చేయగా, హ్యాంగ్‌సంగ్, కోస్పి నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభపడ్డాయి.