బిజినెస్

మత్స్యసంపద విక్రయాలకు వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 18: మత్స్యకారులకు మార్కెట్ సౌకర్యం, గిట్టుబాటు ధర కల్పించేలా చేపల మార్కెట్లలో ఫిష్ మార్కెట్ ప్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఏర్పాటు చేసి ట్యాబ్‌లు అందజేస్తున్నామని కొచ్చిన్‌కి చెందిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) సైంటిస్ట్ డా. శ్యాం సలీం తెలిపారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు, రాష్ట్ర మత్స్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువా రం సబ్ కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో షిఫ్ మార్కెట్ ప్రైస్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై అవగాహన కల్పించేందుకు మత్స్యకారులు, మ త్స్య వ్యాపారస్తులకు సదస్సు నిర్వహించారు. సదస్సులో శ్యాం సలీం మాట్లాడుతూ మత్స్యకారులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఇందులవో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మత్స్య సంపదలో వివిధ కేటగిరిల్లో ఉన్న చే పల ధరలకు సంబంధించి అన్ని ప్రాం తాల్లో ఉన్న మత్స్యకారులకు సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్ పద్ధతి ద్వారా ఎప్పటికప్పుడు తెలియపర్చేందుకు ఫిష్ మార్కెట్ ప్రైస్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం వెబ్‌సైట్‌ను రూపొందించడం జరిగిందన్నారు.
ప్రతి షిఫ్ మార్కెట్లో ఎంపిక చేసిన ఔత్సాహికులైన మత్స్యకారులను గుర్తించి వారికి ఓక ట్యాబ్ ను ఉచితంగా అందజేస్తామని ట్యాబ్ నిర్వహణకు ప్రతి నెలా రూ. 1500 ప్ర భుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. తొలిదశలో విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ, నిజాంపట్నం, ఒంగోలు, నెల్లూరు, చీరాల తదితర ప్రాంతాల్లోని షిఫ్ ల్యాండింగ్ మార్కెట్లకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ట్యాబ్ సౌకర్యం కల్పించిన షిఫ్ మార్కెట్‌కు సంబంధించి 5 నిమిషాల వీడియో క్లిప్పింగ్ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న చేపల రకాలు వా టి ధరలు ఫొటోలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ట్యాబ్ ద్వారా వెబ్‌సైట్ లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. తద్వారా ఇతర మార్కెట్లకు సంబంధించిన మత్స్యకారులు వ్యాపారస్తులు సమాచారాన్ని తెలుసుకుని గిట్టుబాటు ధర ఉన్న మార్కెట్లలో వారి మత్స్య సంపదను విక్రయించుకునే అవకాశం ఉంటుందన్నారు. సదస్సులో విశాఖపట్నం సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సైంటిస్ట్ డా. రాజు, నేషనల్ షిఫరీస్ డెవలప్‌మెంట్ బోర్డు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డా. చలపతిరావు, మత్స్య శాఖ కృష్ణా జిల్లా జాయింట్ డైరెక్టర్ ఎండీ యాకూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.