బిజినెస్

ఈ ఏడాది వృద్ధిరేటు అంచనాలు 0.2% తగ్గుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ప్రస్తుత సంవత్సరానికి మనదేశ వృద్ధి రేటు అంచనాలను ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధిరేటు తయారీ ప్రక్రియను ఆధునీకరించడం వల్ల వాణిజ్యపమైన సేవలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నందువల్ల మనదేశ వృద్ధిరేటు అంచనాలూ తగ్గించాల్సి వచ్చిందని ఏడీబీ పేర్కొంది. ఐతే వేగంగా చైనాకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతుందని నివేదించింది. ఈ మేరకు సవరించిన ‘ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్’ను ఏడీబీ గురువారం నాడిక్కడ విడుదల చేసింది. అలాగే 2019లో చైనా వృద్ధిరేటు 6.3 శాతంగా ఉంటుందని, అంతేకాకుండా ఆ దేశానికి అమెరికాతో సాగుతున్న ఎడతెగని వాణిజ్య యుద్ధంగా కారణంగా 2020లో ఆ వృద్ధిరేటు 6.1గా తగ్గుముఖం పడుతుందని కూడా అంచనావేసింది. భారత్‌కు మాత్రం భవిష్యత్తు బాగుందని 2020-21 ఆర్థిక సంవత్సరంలో మనదేశం మళ్లీ 7.2 శాతం వృద్ధిరేటును అందుకుంటుందని ఏడీబీ నివేదిక పేర్కొంది. ఇటీవల మనదేశంలో చేపట్టిన వాణిజ్య విస్తరణకు సంబంధించిన సంస్కరణలు, బ్యాంకుల ఆర్థిక స్థితి బలోపేతానికి చేపట్టిన చర్యలు, మొండి రుణ బకాయిల వత్తిడిని తగ్గించేందుకు చేపట్టిన చర్యలు భవిష్యత్‌లో దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని నివేదిక స్పష్టం చేసింది. గత ఏప్రిల్‌లో విడుదలైన ఏడీబీ అంచనాల్లో 2020 మార్చితో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో మనదేశ వృద్ధిరేటు 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఐతే ఆ రేటును 7.2కు తగ్గించిన ఏడీబీ ఈ ఏడాది పూర్తయ్యే సరికి ఆ వృద్ధిరేటు 7శాతానికి తగ్గుతుందని సవరించింది. దీనికి కారణంగా 2018-19లో మందగించిన వృద్ధిరేటును చూపిన ఏడీబీ, తదుపరి అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన ప్రతికూలతలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక, వాణిజ్య సంస్కరణల వల్ల విదేశీ మారక ద్రవ్య విలువలతోబాటు, ముడి చమురు ధరలపై ప్రభావం పడే అకాశాలున్నాయని సవరించిన నివేదిక తెలిపింది. అలాగే ప్రైవేటు వినిమయం, పెట్టుబడుల వృద్ధిని సైతం మందగించేలా చేసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇక సరఫరా విషయాన్ని తీసుకుంటే వ్యవసాయ, తయారీ రంగాల వృద్ధి నెమ్మదిస్తుందని, సేవా రంగం మాత్రం కొంత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ప్రాధాన్యతాప్రాతిపదికన వాణిజ్య వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు అమెరికా పేర్కొనడం వల్ల మనదేశ ఎగుమతి రంగం స్వల్పంగా 1.8 శాతం వృద్ధిచెందుతుందని ఏడీబీ అంచనావేసింది. 2019-20లో వ్యవసాయ రంగం ఆరోగ్యప్రదమైన వృద్ధిని నమోదు చేస్తుందని, ప్రస్తుతానికి మాత్రం వాతావరణ పరిస్థితులు, రుతుపవనాల ప్రభావం సాధారణ స్థాయిలోనే ఉన్నాయని తెలిపింది.