బిజినెస్

స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 1.40 వేల కోట్ల విలువైన వాటాల విక్రయం ఐఎంఎఫ్ గణాంకాలతోనూ ప్రతికూలతలు
560.45 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ 177.65 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ముంబయి, జూలై 19: వరుసగా రెండోరోజూ దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు కొనసాగాయి. విదేశీ పోర్టుపోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐలు)పై పన్ను మినహాయింపుఉంటుందన్న నమ్మకంపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లడంతో ఆ ప్రభావం శుక్రవారం స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో రెండు సూచీలూ తీవ్ర స్థాయిలో నష్టాలను నమోదు చేశాయి. వాహన, బ్యాంకింగ్ స్టాక్స్‌లో భారీగా అమ్మకాల వత్తిడి నెలకొనడంతో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా 560.45 పాయింట్లు కోల్పోయి 1.44 శాతం నష్టాలతో 38,337.01 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులకు గురైన ఈ సూచీ ఓ దశలో ఒక్కసారిగా 787 పాయింట్లు ఎగబాకి 39,058.73 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఐతే ఆ తర్వాత దిగువ చూపులు మొదలై 38,271.35 పాయింట్ల కనిష్టానికి చేరింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌సీ సూచీ నిఫ్టీ సైతం 177.65 పాయింట్లు కోల్పోయి 1.53 శాతం నష్టాలతో 11,419.25 పాయింట్ల దిగువకు స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ తొలుత 11,399.30 పాయింట్ల కనిష్టాన్ని, తర్వాత 11.640 పాయింట్ల గరిష్టాన్ని స్పృశించింది. ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా 4.36 శాతం నష్టపోయాయి. హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సూచీ 1.01 శాతం నష్టాలను చవిచూసింది. ఈ సంస్థ త్రైమాసిక ఫలితాలు సైతం నష్టాలను నివారించకపోవడం గమనార్హం. ఇలావుండగా ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఓఎన్‌జీసీ మాత్రమే సెనె్సక్స్ ప్యాక్‌లో 2.32 శాతం లాభాలను సంతరించుకున్నాయి. కాగా పార్లమెంట్‌లో గురువారం నాడు మార్కెటింగ్ సమయం ముగిశాక జరిగిన ఓ చర్చ సందర్భంగా మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక సంపన్న వర్గాలపై విధిస్తున్న పన్ను శాతాన్ని పెంచడం వల్ల విదేశీ పోర్టుపోలియో పెట్టుబడిదారులు వెనుకడుగు వేస్తారన్న వాదనను తోసిపుచ్చారు. వ్యక్తిగతంగా రెండు కోట్ల రూపాయలకు పైబడిన వార్షికాదాయం కలిగిన వారిపై విధించే పన్ను శాతాన్ని పెంచడం వల్ల కూడా ఎఫ్‌పీఐలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, ఎందుకంటే అలాంటి వారిని ఓ కంపెనీగా నిర్వహణదారులుగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీఐలపై పన్ను మినహాయింపులు ఉండబోవన్న విషయాన్ని మంత్రి అంతర్లీనంగా వ్యక్తం చేశారని మార్కెట్ విశే్లషకులు పేర్కొంటున్నారు. దీంతో పన్ను భయంతో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) గురువారం ఏకంగా రూ. 1,404.86 కోట్ల రూపాయల విలువైన వాటాలను విక్రయించారు. అయితే దేశీయ సంస్ధాగత మదపర్లు (డీఐఐలు) రూ. 329.05 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారు. అలాగే ఐఎంఎఫ్ గణాంకాల మేరకు భారత్ ప్రస్తుత (2018-19) పద్దుల బ్యాలెన్స్ లోటు 68 బిలియన్ డాలర్ల నుంచి 49 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని పేర్కొనడం కూడా మార్కెట్ సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని విశే్లషకులు పేర్కొంటున్నారు. ఇలావుండగా ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, కోస్పి, నిక్కీ 2 శాతం లాభపడ్డాయి. అలాగే ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలను సంతరించుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వుకు చెందిన అధికారులు రాబోయే 30,31 తేదీల్లో జరిగే విధాన నిర్ణాయక సమావేశంలో అధిక శాతం రేట్ల కోత జరుగుతుందన్న సంకేతాలు ఇవ్వండం విదేశీ మార్కెట్లకు ఊతంగా మారిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వల్పంగా బలడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం స్వల్పంగా బలపడింది. 5పైసలు లాభపడిన రూపాయి డాలర్‌కు 68.92 రూపాయలుగా ఇంట్రాడేలో ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు సైతం 1.71 శాతం పెరిగి బ్యారెల్ 62.99 డాలర్లు పలికింది.