బిజినెస్

ప్రధానమంత్రి ఉజ్వల యోజన భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: దేశంలోని పేద ప్రజల మేలు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ (ఉజ్వల యోజన) పథకాన్ని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ (ఐఈఏ) ప్రశంసించింది. వాతావరణంతోపాటు మహిళల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన ఈ ఉచిత గ్యాస్ పథకం ప్రభుత్వం సాధించిన ‘గొప్ప ఘనత’గా ఐఈఏ అభివర్ణించింది. ‘్భరతదేశం అంతటా 2020 నాటికల్లా ఎల్‌పీజీ సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం గొప్ప ఘన త. ఇది కేవలం ఇంధనం సమస్యే కాదు. ఇది ఒక ఆర్థిక సమస్య. ఇది ఒక సామాజిక సమస్య’ అని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీహ్ బిరోల్ శుక్రవారంనాడు ఇక్కడ జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ప్రారంభించారు. ఉచిత గ్యాస్ పథకం వల్ల దేశంలోని పేద కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్ల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటివరకు 7.4 కోట్ల మందికి ఉచిత గ్యాస్ అందజేయగా, 2020 నాటికల్లా ఈ లక్ష్యాన్ని 8 కోట్లకు చేర్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
కర్రలు, వ్యవసాయానికి సంబంధించిన వృథా సామాగ్రి వంటిని గ్రామీణ ప్రజలు వంట చెరకుగా గత కొనే్నళ్లుగా ఉపయోగిస్తుండడంతో ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడడంతోపాటు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చునని భావించింది. ‘ఉజ్వల కేవలం ఒక ఇంధన ప్రగతి మాత్రమే కాదు.. సామాజిక, ఆర్థిక ప్రగతిలో సాధించిన ఘనత’ అని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీహ్ బిరోల్ వ్యాఖ్యానించారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు 28 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు మంజూరు చేయడం ద్వారా దేశంలోని దాదాపు 90 శాతం ప్రజలకు అందజేసింది.
2020-21 సంవత్సరం వరకు దేశంలోని అన్ని ఇళ్లల్లో వంట చేసుకునేందుకు పరిశుద్ధమైన, సౌకర్యవంతమైన, శక్తివంతమైన ఎల్‌పీజీ కనెక్షన్లు అందజేయడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇదిలావుండగా, మహిళలు, చిన్నారుల ఆరోగ్యంతోపాటు వాతావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ పథకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది.