బిజినెస్

‘పవన్ హాన్స్’ వేలానికి నిబంధనల సడలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ప్రభుత్వ రంగంలోని హెలికాప్టర్ సేవల సంస్థ ‘పవన్ హాన్స్’ను ప్రైవేటీకరించేందుకు గత ఏడాది చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో చివరికి కేంద్ర ప్రభుత్వం నిబంధనల సడలింపుచర్యలకు ఉపక్రమించింది. ఇందులోప్రధానంగా ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం, ఆస్తుల విక్రయం, పన్ను విధానానికి సంబంధించిన అంశాలను బిడ్డర్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని భావిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈక్రమంలో సవరించిన విక్రయ నిబంధల ప్రతిపాదనల్లో టెండరు దక్కించుకున్న బిడ్డర్ ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న అందరు ప్రభుత్వ ఉద్యోగులను ఏడాదిపాటు కొనసాగించాల్సి ఉంటుంది. గతంలో ఈ నిబంధన రెండేళ్ల వరకు ఉండేది. అలాగే పవన్‌హాన్స్‌కు చెందిన రూ. 577 కోట్ల పన్నులు చెల్లించాలన్న నిబంధనను కూడా సరళీకరించాలని భావిస్తోంది. అలాగే ఆ సంస్థ ఆస్తులను బిడ్డర్‌కు రెండేళ్ల కాలంలో అందజేస్తారు. ఈ వ్యవధి ఇప్పటి వరకు మూడేళ్లుగా ఉంది. ప్రధానంగా పన్ను విషయంలో చేపట్టే సరళీకృత చర్యల వల్ల సంస్థ నిర్వహణకు స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొంటుందని ఆ అధికార వర్గాలు అభిప్రాపడ్డాయి. ఈ సంస్థలోప్రభుత్వానికి 51 శాతం వాటాలున్నాయి. మొత్తం 43 హెలికాప్టర్లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. మిగిలిన 49 శాతం వాటాలు ఓఎన్‌జీసీ సొంతం చేసుకుంది. కాగా సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఈ సంస్థ విక్రయంపై మళ్లీ దృష్టి సారించింది. గత ఏప్రిల్ నెలాఖరు వరకు అందిన గణాంకాల మేరకు ఈ సంస్థలో మొత్తం 718 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 415 మంది పర్మనెంట్, 303 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. కంపెనీలో 116 మంది పైలెట్లు, 101 మంది ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ ఇంజనీర్లు, 52 మంది ఎగ్జిక్యూటివ్‌లు, 157 మంది టెక్నీషియన్లు, మరో 202 మంది టెక్నికల్, నాన్‌టెక్నికల్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 2018-19లో ఈ సంస్థ రూ. 410 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో ఉద్యోగుల నిర్వహణ ఖర్చు రూ. 180 కోట్లు. ఇలావుండగా సుమారు రూ. 350 కోట్లకు పైబడి టర్నోవర్ ఉన్న కంపెనీలను ఈ టెండర్లకు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.