బిజినెస్

పేమెంట్ బ్యాంకుల భవిత అగమ్యగోచరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 22: వివిధ రకాల చెల్లింపులు నిర్వహిస్తున్న పేమెంట్ బ్యాంకులకు భవిష్యత్ ఆశాజనకంగా లేదు. ఈ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా నిధులు జొప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నానికి రెగులేటరీ సైతం అవసరమన్న విషయాన్ని గుర్తించాలని సోమవారం నాడిక్కడ విడుదలైన ఎస్‌బీఐకి చెందిన వాణిజ్య నిపుణుడి అధ్యయన నివేదిక పేర్కొంది. ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్‌ను వచ్చే అక్టోబర్ నుంచి మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించిందన్న వార్తల నేపథ్యంలో వెలువడిన ఎస్‌బీఐ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. వొడాఫోన్ ఎం-పెసా ఇప్పటికే ఈనెలారంభంలోనే మూసివేతకు గురైంది. ఈక్రమంలో భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని నివేదిక పేర్కొంది. అయితే సమయ పాలనతో సాగే వాణిజ్య విస్తరణకు, వృద్ధికి అవకాశాలున్నాయని, ఈ దిశలో ప్రభుత్వం, రెగ్యులేటరీ విభాల వెన్నుదన్ను ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపింది. కేటాయించిన లక్ష్యాల సాధనలో పేమెంట్ బ్యాంకులు విఫలమయ్యాయని పేర్కొంది. 2014లో మొత్తం 11 పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు లైసెన్సులు ఇచ్చినప్పటికీ కేవలం 4 సంస్థలు మాత్రం ఈ బ్యాంకులు ముందుకు రావడం జరిగింది. అటు ఆస్తుల నిర్వహణలోనూ, ఇటు బాధ్యతల నిర్వహణలోనూ ఘోర వైఫల్యం చోటుచేరకుందని, ఆ బ్యాంకులకు రుణాలిచ్చే అధికారాలు, డిపాజిట్లు సేకరించే అధికారాలు లేకపోవడం వల్ల మూలధన అవసరాల్లో 15 శాతం తగ్గుదల నెలకొందని నివేదిక వివరించింది. ఈ సంస్థలు తమ వాణిజ్య ప్రణాళికలు రెగ్యులేటరీ విభాగాలకు తెలిపి తగు సూచనలతో నిర్వహిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రస్తుతం పోటీ యుగంలో కంపెనీలు అనుసరిస్తున్న సాంకేతికతతో కూడిన వాణిజ్య మోడల్‌ను సైతం అందిపుచ్చుకునేలా ఈ బ్యాంకుల పనితీరు మారాల్సివుందని ఆ నివేదిక సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐతే ఈ బ్యాంకులు అంతర్జాతీయ బ్యాంకులతో పోటీపడగలిగే స్థాయిలో పనితీరును కనపరచడం లేదని పేర్కొంది.