కృష్ణ

ఎయిర్ ఇండియా సర్వీసులు పునఃప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి కృషితో రద్దయిన పలు ఎయిర్ ఇండియా సర్వీసులు పునః ప్రారంభం కానున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుండి గతంలో ఎయిర్ ఇండియా కొనసాగించిన విజయవాడ-్ఢల్లీ, ఢిల్లీ-విజయవాడ, విజయవాడ-తిరుపతి సర్వీసులను ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఎంపీ బాలశౌరి ప్రయాణీకుల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని రద్దయి సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతూ ఎయిర్ ఇండియా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హరిదీప్ సింగ్ పురిజి, చైర్మన్ అండ్ డైరెక్టర్ అశ్విని లోహానీని కోరారు. ఈ మేరకు ఒక లేఖ కూడా రాశారు. స్పందించిన ఎయిర్ ఇండియా చైర్మన్ అండ్ డైరెక్టర్ రద్దయిన సర్వీసులను పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎంపీ బాలశౌరి సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు.