బిజినెస్

కొనసాగుతున్న నష్టాల పరంపర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 23: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజైన మంగళవారం సైతం సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీల బలహీన త్రైమాసిక ఫలితాలతో ఫైనాన్షియల్ స్టాక్స్ పెద్దమొత్తాల్లో నష్టపోయాయి. తొలుత మెరుగైన లాభాలతోనే ఆరంభమైన బీఎస్‌సీ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనై నష్టాల్లోకి జారుకుంది. చివరిగా 48.39 పాయింట్లు కోల్పోయి 0.13 శాతం నష్టాలతో 37,982.74 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఓ దశలో 37,898.90 పాయింట్ల కనిష్టాన్ని, మరోదశలో 38,217.81 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా పేరున్న ఎస్‌బీఐ వాటాలు దాదాపు 3శాతం నష్టాలపాలయ్యాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, టాటాస్టీల్ సైతం నష్టపోయాయి. మరోవైపు పవర్‌గ్రిడ్, కోటక్ బ్యాంక్, హీరోమోటో కార్ప్, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్ సెనె్సక్స్ ప్యాక్‌లో లాభపడ్డాయి. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 15.15 పాయింట్లు కోల్పోయి 0.13 శాతం నష్టాలతో 11,331.05 దిగువన స్థిరపడింది. ఈ సూచీ సైతం తొలుత 11,302.05 పాయింట్ల కనిష్టాన్ని, తర్వాత 11,398.15 పాయిట్ల గరిష్టాన్ని స్పృశించింది. ఇక రంగాలవారీగా తీసుకుంటే బీఎస్‌ఈలో ఫైనాన్స్, విద్యుత్, వాహన రంగాలు అధిక స్థాయిలో 0.82 శాతం నష్టపోయాయి. మరోవైపు వినిమయ వస్తువులు, ఎఫ్‌ఎంసీజీ, స్తిరాస్థి రంగాలు లాభపడ్డాయి. బ్రాడర్ మార్కెట్‌లో బీఎస్‌సీ మిడ్‌క్యాప్ సూచీ 0.56 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.38 శాతం లాభాలను నమోదు చేశాయి. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేకపోవడంతోబాటు, పలు కంపెనీల బలహీన త్రైమాసిక ఫలితాలు స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయని, ఇందువల్లే విదేశీ సంస్థాగత మదుపర్లు వాటాల విక్రయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని ప్రముఖ విశే్లషకుడు సునిల్ శర్మ అభిప్రాయపడ్డారు.
స్వల్పంగా నష్టపోయిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం స్వల్పంగా తగ్గి 68.94 రూపాలుగా ట్రేడైంది. అలాగే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 0.16 శాతం తగ్గి బ్యారెల్ 63.16 డాలర్ల వంతున పలికింది. ఇలావుండగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులను పరిశీలిస్తే ఆసియా దేశాల్లో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, కోస్పి, నిక్కీ లాభాలతో ముగిశాయి. అలాగే ఐరోపా దేశాలు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభపడ్డాయి.