బిజినెస్

పరోక్ష పన్నుల అప్పీళ్లపై తగ్గిన పెండింగ్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పరోక్ష పన్నులకు సంబంధించిన అప్పీళ్లపై అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్య 61 శాతం తగ్గిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం రాజ్యసభలో ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. సుప్రీం కోర్టుతోబాటు వివిధ హైకోర్టులు, కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (సీఈఎస్‌టీఏటీ)ల్లో గడచిన రెండేళ్ల కాలంలో ఈ పెండింగ్ కేసుల సంఖ్య 1.05 లక్షలకు దిగివచ్చిందని ఆయన వివరించారు. 2017 జూన్ 30 నాటికి ఉన్న 2,73,591 కేసులు 2019 మార్చి 31 నాటికి 1,05,756కి తగ్గాయని ఆయన వివరించారు. అలాగే ప్రత్యక్ష పన్నులకు సంబంధించి 3.41 లక్షల కేసులు కమిషనర్ (అప్పీల్) వద్ద పెండింగ్‌లో ఉండగా, 92,205 కేసులు ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అలాగే హైకోర్టుల్లో 43,224 కేసులు, సుప్రీం కోర్టులో 6,188 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. కాగాప్రత్యక్ష పన్నుల శాఖ సెంట్రల్ బోర్డు (సీబీడీటీ) కోర్టులు, ట్రిబ్యునళ్లలో అప్పీళ్లకు సంబంధించిన కేసుల్లో చెల్లించాల్సిన సొమ్ము పరిమితిని పెంచిందని మంత్రి చెప్పారు. రూ 20 లక్షల పైబడిన పన్నులపై ఐటీఏటీలో, రూ. 50 లక్షలకు పైబడిన కేసులు హైకోర్టుల్లో, రూ. కోటికి పైబడిన కేసులు సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవాలనే నిబంధన ఉందని మంత్రి రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఒకే రకమైన కేసులు అధికంగా పేరుకున్నప్పుడు ఈ కేసులను క్రమబద్ధీకరించి, ప్రాధాన్యతా ప్రాతిపదికన పన్నులు నిర్ణయించేందుకు సుప్రీం కోర్టుకు నివేదించడం జరుగుతుందని మరోప్రశ్నకు సమాధానంగా ఠాకూర్ తెలిపారు. 2018-19లో ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ. 11.37 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, ఇది 2017-18లో వచ్చిన 10.02 లక్షల కోట్ల కంటే అధికమని వివరించారు. 2016-17లో ఈ పన్నుల ద్వారా రూ. 8.49 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అలాగే జీఎస్‌టీ, సమగ్ర జీఎస్‌టీ, పరిహార సెస్సు, కస్టమ్స్, ఎక్సైజ్, సేవా పన్నులతో కూడిన పరోక్ష పన్నులపై 2018-19లో రూ. 9.37 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. 2017-18లో వచ్చిన 9.11 లక్షల కోట్లకంటే గత ఆర్థిక సంవత్సర ఆదాయం అధికమని ఆర్థిక శాఖ సహాయ మంత్రి వివరించారు. 2017 జూలై 1 నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పరోక్ష పన్ను వసూళ్లు 8.61 లక్షల కోట్లమేర జరిగాయని ఆయన తెలిపారు.

చిత్రం...కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్