బిజినెస్

ఆర్థిక గణాంకాలు, ఆటో అమ్మకాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశీయ స్టాక్ మార్కెట్లను ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ ప్రసంగం ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం యెల్లెన్ ద్రవ్యసమీక్ష సందర్భంగా మాట్లాడగా, అప్పటికే దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. దీంతో సోమవారం దీనిపై సూచీలు స్పందించే వీలుందని పేర్కొంటున్నారు. అలాగే ఆటోరంగ సంస్థల దేశీయ అమ్మకాలు కూడా మదుపరుల పెట్టుబడుల సరళిని నిర్దేశిస్తాయని చెబుతున్నారు. సెప్టెంబర్ 1న (గురువారం) ఆగస్టు నెలకుగాను అమ్మకాల వివరాలు వెల్లడి కానున్నాయి. దీంతోపాటు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. తయారీరంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎమ్‌ఐ) గణాంకాల ప్రభావం కూడా ఉండనుందని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గాను డిఎల్‌ఎఫ్, ఎమ్‌ఒఐఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను ఈ వారమే ప్రకటించనున్నాయి. దీంతో వీటి ప్రభావం కూడా సూచీల కదలికలపై ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 294.75 పాయింట్లు కోల్పోతే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 94.35 పాయింట్లు పడిపోయింది.