బిజినెస్

నికర విక్రయదారులుగా ఎఫ్‌పీఐలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఆగస్టు నెలలోనూ విక్రయాలను కొనసాగించారు. ఆగస్టు నెలలోని ఏడు ట్రేడింగ్ సెషన్లలోనే వారు నికరంగా రూ. 9,197 కోట్ల నిధులను భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. దేశీయ, ప్రపంచ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వారు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించడం ద్వారా నిధులను ఉపసంహరించుకున్నారు. అయితే, ప్రభుత్వం విదే శీ మదుపరులకు పన్నుకు సంబంధించి ఉన్న ఆం దోళనలను పరిష్కరించగలిగితే, ఈ ధోరణి పూర్తి గా మారిపోతుందని విశే్లషకులు పేర్కొన్నారు. తా జా డిపాజిటరీస్ గణాంకాల ప్రకారం, ఎఫ్‌పీఐలు ఆగస్టు 1-9 తేదీల మధ్య భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 11,134.60 కోట్ల నిధులను ఉపసంహరించుకోగా, డెబిట్ సెగ్మెంట్‌లో రూ. 1,937.54 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంటే నికరంగా మొత్తం రూ. 9,197.06 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. క్రితం నెల జూలైలోనూ ఎఫ్‌పీఐలు భారత క్యాపిటల్ మార్కెట్లలో రూ. 2,985.88 కోట్ల మేరకు నికర విక్రయదారులుగా ఉన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ట్రస్టులు, వ్యక్తులతో కూడిన అసోసియేషన్ కింద నమోదయిన ఎఫ్‌పీఐలపై అధిక పన్ను విధించినప్పటి నుంచి విదేశీ మదుపరులు నికర విక్రయదారులుగా ఉంటున్నారని విశే్లషకులు తెలిపారు. అమెరికా, యూరో ఆర్థిక వ్యవస్థలు, చైనా జీడీపీ వృద్ధిలో పెరుగుదల లేని కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మాంద్యం వల్ల ఎఫ్‌పీఐలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు.