బిజినెస్

‘ఆస్క్‌మీ’ని ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఈ-కామర్స్ సంస్థ ఆస్క్‌మీ మూసివేతపై స్పందించాలని బిజెపి ఎంపి సుబ్రమణ్యం స్వామి.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ (ఎమ్‌సిఎ)శాఖను కోరారు. దీనివల్ల 4,000 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని అందుకే జోక్యం చేసుకోవాలంటూ ఎమ్‌సిఎ కార్యదర్శి తపన్ రాయ్‌కి స్వామి ఓ లేఖ రాశారు. మలేషియాకు చెందిన ఆస్ట్రో సంస్థ తమకున్న 98.5 శాతం వాటాను ఆస్క్‌మీ నుంచి ఉపసంహరించుకుంటుండగా, దీనికి సంబంధించి ఆస్క్‌మీకి సాయం చేసి, వేలాది మందికి ఉపాధిని దూరం కాకుండా చూడాలని స్వామి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ-కామర్స్ సంస్థ ఆస్క్‌మి.. తమ వ్యాపార కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించుకున్నది తెలి సిందే. గెటిట్‌కు చెందిన స్టార్టప్ సంస్థ అయిన ఆస్క్‌మి.. ఆస్క్‌మి డాట్‌కామ్ (క్లాసిఫైడ్స్), ఆస్క్‌మిబజార్ (ఈ-కామర్స్), ఆస్క్‌మిగ్రాసరీ, ఆస్క్‌మిపే, మెబెల్‌కార్ట్ (ఆన్‌లైన్ ఫర్నీచర్ రిటైల్)లను నిర్వహిస్తోంది.