బిజినెస్

చివరి రోజు స్వల్ప లాభాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వాణిజ్య వారం చివరి రోజైన శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఐతే వారం మొత్తం పరిగణనలోకి తీసుకుంటే రెండు సూచీలు నష్టాలనే మూటగట్టుకున్నాయి. ఈవారం సెనె్సక్స్ 231.58 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 61.85 పాయింట్లు కోల్పోయింది. కాగా చివరి గంటల్లో బ్యాంకింగ్, వాహన రంగ స్టాక్స్‌లో జరిగిన కొనుగోళ్ల మద్దతుతోబాటు, ఆసియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతావరణం శుక్రవారం దేశీయ మార్కెట్లను లాభాల బాటలో నిలిచేందుకు దోహదం చేశాయని వాణిజ్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంట్రాడేలో 470 పాయింట్లు అదనంగా ఎగబాకిన బీఎస్‌ఈ 30 షేర్ల సెనె్సక్స్ ఒడిదుడుకులకు గురై చివరిగా 38.80 పాయింట్ల స్వల్ప ఆధిక్యతతో 0.10 శాతం లాభాలతో 37,350.33 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఈ సూచీ ఒక దశలో 37,444,45 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 26,974.41 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 18.40 పాయింట్ల స్వల్ప ఆధిక్యతతో 0.17 శాతం లాభాలతో 11,047.80 పాయింట్ల ఎగువ స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ సైతం ఒక దశలో 11,068.65 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 10,924.30 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. సెనె్సక్స్ ప్యాక్‌లో యెస్ బ్యాంక్ అత్యధికంగా 3.79 శాతం లాభపడింది. అలాగే పవర్‌గ్రిడ్, మారుతి సుజుకీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సైతం 2.85 శాతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు టీసీఎస్, వేదాంత, హెచ్‌సీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌ఐఎల్ 1.87 శాతం నష్టపోయాయి. ఆర్థిక మాంద్యం, ఆశించిన స్ధాయిలోలేని కంపెనీల ఫలితాలు, అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఒడిదుడుకులు మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని వాణిజ్య విశే్లషకులు భావిస్తున్నారు. వివిధ రంగాల ప్రగతిలో నెలకొన్న స్తబ్ధత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు పరిస్థితిని సమీక్షించింది. 2018-19లో దేశ ఆర్థికాభివృద్ధి మందగించి 6.8 శాతానికి పరిమితమైంది. 2014-15 నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యల్ప ఆర్థికాభివృద్ధి స్థాయి. ఈక్రమంలో వినియోగదారుడిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడంతోబాటు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గే ప్రమాదం నెలకొంది. దీనితోబాటు అంతర్జాతీయ వాణిజ్య, కరెన్సీ యుద్ధాలు సమస్యను మరింత తీవ్రతరం చేశాయి.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం 15 పైసలు బలపడింది. ఇంట్రాడేలో రూ.71.12గా ట్రేడైంది. ఇక ఆసియా వ్యాప్తంగా చూస్తే షాంఘై కాంపోజిట్ సూచీతోబాటు హాంగ్‌సెంగ్, నిక్కీ లాభాల్లో ముగిశాయి. కోస్పి మాత్రం నష్టాలను నమోదు చేసింది. ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలనే నమోదు చేశాయి. ముడి చమురు ధరలు అంతర్జాతీయ బెంచ్‌మార్కుకన్నా 1.89 శాతం పెరిగి బ్యారెల్ 59.33 డాలర్లు వంతున ట్రేడైంది.