బిజినెస్

10 గ్రాములు రూ. 40 వేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 17: దీపావళినాటికి బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని, 10 గ్రాములు 40 వేల రూపాయలకు చేరుకుంటుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశే్లషకులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో బంగారం ధర అమాంతం పెరిగిపోవడంతో అసలు ఇది సామాన్యులకు అందుబాటులో ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 10 గ్రాముల పసిడి ధర 40 వేల రూపాయలకు చేరుకుంటుందన్న విశే్లషకుల అంచనాలు సామాన్యులను మరింత కలవరపెడుతున్నాయి. ఎక్కడైనా అస్థిర రాజకీయ పరిస్థితులు, ఆర్థిక ప్రతికూలతలు తలెత్తిన సందర్భాల్లో బంగారం ధర పెరగడం అన్నది సాధారణంగా జరుగుతుంది. ముఖ్యంగా భవిష్యత్ అంచనాలు, ఒడిదుడుకులను తట్టుకునేందుకే బంగారం డిమాండ్ పెరుగుతుందన్నది కూడా వాస్తవమే. తాజాగా బంగారం అక్టోబర్ కాంట్రాక్టు రేటు 37,995 (10 గ్రాములు)గా ఎంసీఎక్స్‌లో నమోదైంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ టెన్షన్లు కొంతమేర తగ్గడంతో బంగారం డిమాండ్ సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉన్నప్పటికీ దీపావళినాటికి కచ్చితంగా 10 గ్రాముల రేటు 39 వేల నుంచి 40 వేలకు చేరుకుంటుందన్న సంకేతాలు బలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ వృద్ధిరేటు తగ్గడం కూడా ఇటీవల కాలంలో బంగారం రేటు పెరగడానికి కొంతమేర కారణమై ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మదుపుదారులకు నమ్మకమైన ఆదాయం రావాలంటే బంగారం మీదే పెట్టుబడి పెట్టడం ఎంతైనా సబబని చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక అస్థిరతలను ఎదుర్కొనేందుకు పెట్టుబడి పోకుండా ఇస్తే ఆదాయాన్ని ఇచ్చే బంగారం అన్నివిధాలుగా ఉపయోగకరమని చెబుతున్నారు. ఇది పండగల సీజన్ కాబట్టి అనివార్యంగానే బంగారానికి డిమాండ్ పెరగడం, దాని రేటు క్రమంగా ఆకాశాన్నంటడం సహజం. ప్రస్తుత పరిస్థితులను బట్టి బంగారం ధర 10 గ్రాములు 40వేలకు చేరుకుంటుందన్న విశే్లషకుల అంచనాలు మదుపుదారుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.