బిజినెస్

వైదొలగిన బాలేష్ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: వడాఫోన్ ఐడియా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతల నుంచి బాలేష్ శర్మ వైదొలిగారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని దిగ్గజ మొబైల్ ఆపరేటర్ సంస్ధ సోమవారం నాడిక్కడ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుతం వడాఫోన్ గ్రూప్ భారత దేశ ప్రతినిధి (రెప్రజెంటేటివ్)గా వ్యవహరిస్తున్న రవీంద్ర టక్కర్‌ను తక్షణమే మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్టు ఆ ప్రకటన వెల్లడించింది. కాగా తనను బాధ్యతల నుంచి వైదొలగేందుకు అనుమతించాలంటూ బాలేష్ శర్మ చేసిన విజ్ఞప్తికి వడాఫోన్ ఐడియా బోర్డు సమావేశం సోమవారం ఆమోదం తెలిపింది. బాలేష్ శర్మకు సంస్థలో కొత్త బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని, దానిపై త్వరలో వివరాలను వెల్లడిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.