బిజినెస్

ఆర్థ్ధక మాంద్యం ఆందోళనకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొనడం తీవ్ర ఆందోళనకర పరిణామమని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సోమవారం నాడిక్కడ పేర్కొన్నారు. ప్రధానంగా విద్యుత్, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఈదిశగా కొన్ని సంస్కరణలను చేపట్టి ప్రైవేటు రంగాన్ని బలోపేతం చేసేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం చేయాలని రాజన్ సూచించారు. 2013 నుంచి 2016 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన రాజన్ మరో దఫా పనిచేసేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. కాగా దేశ స్థూల వృద్ధిరేటు (జీడీపీ)పై సైతం ప్రభుత్వం మరోమారు దృష్టి సారించాలని, ఈ గణాంకాలు అధిక అంచనాలతో కూడుకున్నవని కేంద్ర ప్రభుత్వ మాజీ చీఫ్ ఎకానమిస్ట్ అరవింద్ సుబ్రమణియన్ మోదీ ప్రభుత్వానికి సూచించారని ఆయన గుర్తు చేశారు. నిజానికి ప్రైవేటు రంగానికి చెందిన కొంతమంది విశే్లషకులు ప్రత్యేక వృద్ధి దృక్పథాన్ని అనుసరించారని, అందులో అధికుల ఆలోచనా శైలి ప్రభుత్వ ప్రాధాన్యతలకన్నా దిగువ స్థాయిలో ఉందని సీఎన్‌బీసీ టీవీ 18కి ఇచ్చిన ఇంటర్య్వూలో రాజన్ పేర్కొన్నారు. 2018-19లో మనదేశ ఆర్థికాభివృద్ధి 6.8 శాతానికి తగ్గిందని, 2014-15 నుంచి తీసుకుంటే ఇదే మనదేశ అతి కనిష్ట ఆర్ధికాభివృద్ధి శాతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది ప్రైవేటు విశే్లషకుల అంచనాలతోబాటు, సెంట్రల్ బ్యాంక్ అంచనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనదేశ స్థూల వృద్ధిరేటు 7 శాతంగా ఉంటుందని ఆంచనా వేయడం జరిగిందని గుర్తు చేశారు. అసలు వాస్తవానికి మరింతగా ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందని, ప్రధానంగా వాహన రంగం 20 ఏళ్ల తర్వాత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఆ రంగంలో వేలాది మంది ఉద్యోగాలు సైతం కోల్పోయే ప్రమాదం నెలకొందని రాజన్ పేర్కొన్నారు. అలాగే స్థిరాస్తి రంగం కూడా బలహీనంగా మారిందని, వేగంగా విక్రయాలు జరిగే వినిమయ వస్తువులు (ఎఫ్‌ఎమ్‌సీజీ) కంపెనీలు కూడా విలువ ఆధారిత వృద్ధిని కోల్పోయాయని రాజన్ తెలిపారు. వీటన్నింటినీ సత్వరం గాడిలోపెట్టాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సరికొత్త సంస్కరణలకు తెరలేపాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించాలని, అప్పుడే ఇప్పటి ఆర్థిక మాంద్యం తొలుగుతుందని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లలో బేరసారాలు చేయడం సంస్కరణ కిందికి రాదని అది కేవలం యుక్తిప్రద చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా రాజన్ చెప్పారు. కనీసం 2 లేదా 3 పర్సంటేజీ పాయింట్ల వృద్ధిరేటును అదనంగా సాధించాలన్నా అసలు ఇప్పటికే నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగం, విద్యుత్ రంగ సమస్యలను చక్కదిద్ది ఉండాల్సిందన్నారు. ముఖ్యంగా ప్రైవేటు రంగాన్ని బలోపేతం చేయాలంటే కొన్ని ప్రత్యేక సంస్కరణలు అవసరమన్నారు. ఉదాహరణకు సబ్బుల పరిశ్రమలు దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడుకున్నవిగా లేవని ఆయన చెప్పారు. మాజీ చీఫ్ ఎకానమిస్ట్ అరవింద సుబ్రమణియన్ పరిశీలన మేరకు నిజానికి 2011-12 నుంచి 2016-17 వరకు జీడీపీ వృద్ధిరేటు అంచనాలు 2.5 శాతం అధికంగా ఉన్నాయని, ఈ తేడాను సరిచేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై సైతం అరవింద సుబ్రమణియన్ సూచనలను అనుసరించాలని రాజన్ సూచించారు.
చిత్రం...రఘురాం రాజన్