బిజినెస్

ఇక ‘59 నిమిషాల’ పోర్టల్ పరిధిలోకి గృహ, వాహన రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: రుణ వాణిజ్యాన్ని విస్తరించుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు కొత్తగా ‘పీఎస్‌బీలోన్స్‌ఇన్ 59 మినిట్స్’ పోర్టల్‌లో గృహ, వాహన రుణాలతో సహా రీటైల్ ఉత్పాదనలను ప్రవేశపెట్టనున్నాయి. ప్రస్తుతం ఈ పోర్టల్ ద్వారా ఒక కోటి రూపాయల పరిమితి వరకు ఉన్న రుణాలను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈలకు) మంజూరు చేసేందుకు ఆమోదం తెలపడం జరుగుతోంది. కేవలం 59 నిమిషాల్లోనే రుణ మంజూర్లు చేయాలన్నది ఈ పోర్టల్ లక్ష్యం. కాగా స్టేట్‌బ్యాంక్ సహా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్‌లు ఈ పోర్టల్ ద్వారా సూత్రప్రాయంగా జరిగే రుణాల మంజూరును 5 కోట్లకు పెంచాలని నిర్ణయించాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఆన్‌బోర్డు కింద ఈ పోర్టల్‌లో మరికొన్ని రీటైయిల్ ఉత్పత్తులకు సైతం రుణాలివ్వాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రత్యేకించి గృహ, వాహన రుణాలను ఈ శీఘ్ర పోర్టల్ పరిధిలోకి తీసుకురావాలని ఆ బ్యాంకు భావిస్తోందని జనరల్ మేనేజర్ సలిల్ కుమార్ స్వెయిన్ పీటీఐకి చెప్పారు. కాగా ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈ రుణాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఐఓబీ సైతం రీటెయిల్ రుణాలను ఈ పోర్టల్ ద్వారా మంజూరు చేయాలని నిర్ణయించింది. దరఖాస్తులు పెద్దసంఖ్యలో పేరుకున్న దృష్ట్యా ఈ వేగవంత పోర్టల్ ద్వారా వాటిని క్లియర్ చేయాలని ఐఓబీ భావిస్తోంది.