బిజినెస్

ఆల్‌టైం రికార్డు స్థాయికి బంగారం ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: బంగారం ధరలు మంగళవారం ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల (తులం) బంగారంపై రూ. 200 పెరిగి మొత్తం ధర రూ. 38,770 పలికింది. అటు అంతర్జాతీయంగా బంగారం వ్యాపారం ప్రస్తుతం నష్టదాయకంగానే ఉన్నా దేశీయంగా పసిడి వ్యాపారుల నుంచి పెరిగిన డిమాండ్ కారణంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని స్ధాయికి చేరుకున్నాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. అయితే మంగళవారం వెండి ధరలు మాత్రం కిలోపై రూ. 1,100 దగ్గడం విశేషం. పారిశ్రామిక యూనిట్ల నుంచి, నాణేల మార్కెట్ల నుంచి డిమాండ్ తగ్గడం వల్లే వెండి ధరల్లో దగ్గుదల చోటుచేసుకుందని ‘ఆల్‌ఇండియా సరాఫా అసోసిషియేషన్’ పేర్కొంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 43,900గా ట్రేడైంది. కాగా బంగారానికి ఆభరణాల తయారీదార్ల నుంచి, వర్తకుల నుంచి డిమాండ్ బాగా పెరిగింది. రూపాయి విలువ బలహీన పడటం కూడా బంగారం ధర పెరిగేందుకు దోహదం చేసిందని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధరల్లో మాత్రం స్థిరత్వ కొనసాగుతోంది. ఔన్స్ 1,500 వంతున ట్రేడవుతోంది. ఇందుకు ప్రధానంగా అమెరికన్ డాలర్ విలుల బలంగా ఉండటంతోబాటు, అధిక స్థాయిలో లాభాల స్వీకరణ దోహదం చేశాయని అంటున్నారు. గత జూలైలో జరిగిన అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో వచ్చే శుక్రవారం జరుగనున్న ‘వార్షిక ఆర్థిక విధాన సింపోజియం’లో చైర్మన్ జరోమ్ పావెల్ ఏ ప్రకటన చేస్తారన్న విషయంపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మదుపర్లు దృష్టి సారించారు. ఈక్రమంలో తమ పెట్టుబడులను భారత్‌లోని బంగారం వ్యాపారం వైపు మళ్లించారని విశే్లషకులు చెబుతున్నారు. ప్రధానంగా తదుపరి రేట్ల కోతకు సంబంధించిన విధాన నిర్ణయాన్ని పావెల్ ప్రకటిస్తారని, అదే జరిగితే దాని ప్రభావం బంగారం మార్కెట్‌పై పడుతుందని విశే్లషకుడు హరీష్.వి పేర్కొన్నారు. కాగా న్యూయార్క్‌లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1,496.60 డాలర్ల కనిష్ట స్థాయిలో, వెండి ఔన్స్ 16.93 డాలర్ల కనిష్ట స్థాయిలో ట్రేడయ్యాయి. ఇక మనదేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములు రూ. 38,770 వంతున, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ. 38,600 వంతున ట్రేడయ్యాయి. ఇక ఎనిమిది గ్రాముల సవరం బంగారం మాత్రం మంగళవారం రూ. 200 తగ్గి రూ. 28,600 వంతున ధర పలికింది. అలాగే వార ప్రాతిపదికన సరఫరా చేసే వెండి సైతం రూ. 113 తగ్గి కిలో రూ. 43,422గా ట్రేడైంది. వెండి నాణేల ధర సైతం 100 పీసులపై రూ. 2వేలు తగ్గి కొనుగోళ్లలో రూ. 89,000, అమ్మకాల్లో రూ. 90,000 వంతున పలికింది.