బిజినెస్

విదేశీయుల కోసం ఇక ఈ-టూరిస్ట్ వీసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: విదేశీ పర్యాటకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ- టూరిస్ట్ వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విదేశీ పర్యాటకులు ఎక్కువగా వచ్చే జూలై నుంచి మార్చి వరకూ ఎక్కువ మొత్తంలో రుసుం వసులు చేస్తారు. విదేశీ పర్యాటకులు రాక స్వల్పంగా ఉండే ఏప్రిల్ నుంచి జూన్ వరకూ నామమాత్రంగా రుసుం ఉంటుంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ఈ విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 30 రోజులు కొత్త విధానం అమల్లో ఉంటుంది. ఈ 30 రోజుల ఈ- టూరిస్టు వీసా కోసం 10 అమెరికన్ డాలర్లు వసూలు చేస్తారు. అలాగే జూలై నుంచి మార్చి వరకూ నెల రోజుల ఈ-టూరిస్టు వీసా కోసం 25 డాలర్ల రుసుం వసూలు చేయనున్నారు. అలాగే కొత్తగా ఐదేళ్ల ఈ-టూరిస్టు విధానాన్ని కూడా తీసుకురానున్నారు. దీనికి 80 అమెరికన్ డాలర్లు ఫీజును వసూలు చేస్తారు. ఏడాది ఈ-టూరిస్టు వీసా కోసం 40 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ నేతృత్వంలో ఢిల్లీలో మంగళవారం వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విదేశీ పర్యాటకుల అకర్షించే లక్ష్యంతో ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చినట్టు ప్రహ్లాద్‌సింగ్ పటేల్ వెల్లడించారు.
ఇలా ఉండగా ఈ- వీసాలోనూ కొన్ని మినహాయింపులు కల్పించారు. ఫోరం ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్ కో-ఆపరేషన్(ఎఫ్‌ఐపీఐసీ) సభ్యదేశాలకు ఎలాంటి వీసా ఫీజు ఉండదు. ఫిజి, కూక్ ఐలాండ్స్, కిరిబిటీ, మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేసియా, నవురు, నౌ ఐలాండ్, పాలవ్, పాపువా న్యూ గినియా, సమోవా, సాల్మన్ ఐలాండ్స్, టోంగా, తువాలు, వనుఅతు దేశాలకు ఎలాంటి
రుసుం ఉండదు. అలాగే మైన్మార్, అర్జెంటీనా, ఇండోనేషియా, జమైకా, మారిషస్, సెచెల్లీస్ దక్షిణ ఆఫ్రికా, ఉరుగ్వే దేశాలకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. జపాన్, సింగపూర్, శ్రీలంక టూరిస్టులకు ఏడాది, ఐదేళ్ల ఈ-వీసా సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. 25 యుఎస్ డాలర్లు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ-టూరిస్టు వీసా విధానానికి కేంద్ర హోమ్, విదేశాంగ మంత్రిత్వశాఖలు ఆమోదం తెలిపాయని పటేల్ వెల్లడించారు.