బిజినెస్

రాష్ట్రంలో త్వరలో కొత్త పారిశ్రామిక విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: మరో రెండు, మూడు నెలల్లో కొత్త పారిశ్రామిక విధానం తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి తెలిపారు. గతంలో ఇచ్చిన రాయితీలు, చేసుకున్న ఒప్పందాలపై శే్వతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొందరు ద్వేషంతో చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేస్తున్నారన్న ప్రచారం అబద్ధమన్నారు. రాష్ట్రాన్ని అవినీతి రహిత, పారదర్శక పాలన దిశగా తీసుకువెళ్తున్నామన్నారు. ఇటీవల విదేశాంగ శాఖ నిర్వహించిన ఔట్ రీచ్ కార్యక్రమంలో అనేక మంది పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి కనబరిచారన్నారు. దాదాపు 800 దరఖాస్తులు పరిశ్రమల ఏర్పాటుకు వచ్చాయన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అస్పష్ట విధానాల కారణంగా పరిశ్రమల శాఖ రాయితీల కింద దాదాపు 2500 కోట్ల రూపాయలు బకాయి పడిందన్నారు. దీని వల్ల పెట్టుబడిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ బకాయిలను తీర్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గతంలో జరిగిన ఒప్పందాలు, తదితర అంశాలపై శే్వతపత్రం విడుదల చేస్తామన్నారు. లోపాయికారీ ఒప్పందాలను, ఆచరణయోగ్యం కాని విధానాలను తాము అంగీకరించబోమని తెలిపారు. తమ ప్రభుత్వ విధానాలు నచ్చి కృష్ణపట్నం పోర్టులో అదాని గ్రూపు 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. రాయితీలపై స్పష్టత ఇచ్చి, పెట్టుబడులను ఆకర్షిస్తామన్నారు. రాయితీలు చెల్లించకుండా రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చిన వారు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, వాటికి ఇస్తున్న రాయితీలు, ప్రోత్సహకాలపై సమీక్షించి, మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఒకే కంపెనీకి రెండు రకాల ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చిందని ఆరోపించారు.
చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి గౌతంరెడ్డి