బిజినెస్

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం అధిక నష్టాల పాలయ్యాయి. ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్ తీవ్ర నష్టాల పాలవడం మొత్తం మార్కెట్ల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపింది. అంతేకాకుండా ఆర్థిక మందగమనం మదుపర్లలో ఆందోళన రేకెత్తించిందని, అందుకే మంగళవారం స్వల్ప స్థాయికే పరిమితమైన నష్టాలు బుధవారం అధిక స్థాయికి చేరాయని వాణిజ్యవర్గాలు తెలిపాయి. ప్రారంభం నుంచే సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. దీంతో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఓ దశలో 305 పాయింట్లు నష్టపోయింది. తర్వాత స్వల్పంగా కోలుకుని 267.64 పాయింట్ల నష్టంతో 37,060.37 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఈ సూచీ ఇంట్రాడేలో 37,406.55 పాయింట్ల గరిష్టం, 37,022,52 పాయింట్ల కనిష్టం మధ్య కదలాడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 98.30 పాయింట్లు కోల్పోయి 0.89 శాతం నష్టాలతో 10,918.70 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఈసూచీ సైతం రోజుమొత్తంలో 11,034.20 పాయింట్ల గరిష్టం, 10,906.65 పాయింట్ల కనిష్టం మధ్య ఊగిసలాడింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో టాటామోటార్స్ 9.29 శాతం భారీ నష్టాల పాలైంది. దాదాపు అదే స్ధాయిలో యెస్ బ్యాంక్ సైతం 8.21 శాతం నష్టపోయింది. అలాగే టాటాస్టీల్, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, ఐటీసీ, వేదాంత, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం సైతం 4.26 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. కాగా ఇంత వ్యతిరేకతలోనూ హీరోమోటోకార్ప్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో, మారుతి, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.78 శాతం లాభాలను సంతరించుకుని స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల పాలవకుండా చేశాయి. ఇలావుండగా అమెరికాలోని వయోమింగ్ ప్రాంతంలోని జాక్సన్ హోల్‌లో జరుగనున్న సింపోజియంలో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జరోమ్ పావెల్ తదుపరి రేట్ల కోతకు సంబంధించిన ప్రకటన చేస్తారని, అంతవరకు వేచిచూద్దామన్న దోరణిని బుధవారం సైతం మదుపర్లు అనుసరించారు. అలాగే ఈనెల 25 నుంచి 27 వరకు ప్రాన్స్‌లో జరిగే జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సుపై సైతం అందరూ దృష్టి కేంద్రీకరించారని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, కోస్పి బుధవారం లాభాల్లో ముగియగా, నిక్కీ మాత్రం నష్టాలను కూడగట్టుకుంది. ఇక ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలనే నమోదు చేశాయి.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం 22 పైసలు బలపడి ఇంట్రాడేలో 71.49గా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు 1.26 శాతం తగ్గి బ్యారెల్ 60.80 డాలర్లుగా ట్రేడైంది.