బిజినెస్

సరికొత్త వాణిజ్య విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఎగుమతులను మరింతగా పెంచేందు వీలుగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ త్వరలో సరికొత్త వాణిజ్య విధానాన్ని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి 2020-25 పంచవర్ష ప్రణాళికతో కూడిన సరికొత్త విధానానికి రూపకల్పన జరుగుతోందని సంబంధిత అధికారులు గురువారం నాడిక్కడ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహానికి రాయితీలు కల్పించేదుకు ఈ కొత్త విధానంలో మార్గదర్శకాలను పొందుపరుస్తారని వెల్లడించారు. ప్రస్తుతం అమలులో ఉన్న వాణిజ్య విధానం కాలవ్యవధి 2020 మార్చి 31తో ముగిసిపోతున్న దృష్ట్యా కొత్త విధానాన్ని అమలు చేయడం జరుగుతుందని, దీనికి ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోందని ఆ అధికారి తెలిపారు. వచ్చే నెలాఖరులో లేదా, అక్టోబర్ ప్రథమార్థంలో ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలిపారు. ప్రధానంగా ఎగుమతులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న కొన్ని సంక్లిష్టతలను సరళతరం చేస్తూ విదేశాల నుంచి వచ్చే షిప్‌మెంట్‌లకు రాయితీలు కల్పించడం ద్వారా ప్రోత్సహించాలన్న లక్ష్యం ఈ కొత్త విధాన నిర్ణయంలో ఉందని తెలిపారు. ఈ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్‌టీ) ప్రస్తుతం ఈ విధాన నిర్ణయానికి తుదిరూపం ఇస్తోంది. ప్రస్తుత విధానం ద్వారా సరుకుల ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందజేసే భారత పథకం (ఎంఈఐఎస్), వస్తువులు, సేవారంగ ఉత్పత్తుల ఎగుమతుల పథకం (ఎస్‌ఈఐఎస్) అమలులో ఉన్నాయి. ఐతే సరికొత్త విధానం ద్వారా ప్రధానంగా వస్తువుల ఎగుమతులకు సంబంధించిన విధానంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత భారత ఎగుమతుల ప్రోత్సాహక పథకాలు సక్రమంగా లేవంటూ అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ వివాదాల పరిష్కార విభాగానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా ఈ కొత్త విధాన నిర్ణయం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆ అధికారి తెలిపారు. ఈ కొత్త విధానానికి సంబంధించిన కేబినెట్ నోట్‌ను సైతం వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందిస్తోంది. ఇందులో సరికొత్త కేంద్ర, రాష్ట్ర పన్నులు, లేవీ రాయితీలతో కూడిన పథకాన్ని పొందుపరచడం జరిగింది. ఈ పథకం ప్రధానంగా వస్త్రాలు, తయారీ వస్తువుల ఎగుమతులకు ఊతమిస్తుంది. తదుపరి దశలవారీగా అన్ని ఎగుమతులకు వర్తింపజేస్తారు. ప్రధానంగా వస్తువుల ఎగుమతులకు సంబంధించిన ప్రస్తుత పథకం ఎంఈఐఎస్‌ను సరికొత్త విధానం పొర్తిగా భర్తీ చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఎంఈఐఎస్ పైనే ప్రధానంగా అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా కొత్తగా రానున్న పథకం ద్వారా అన్ని ఎగుమతులకు రిబేటు ఇవ్వని కేంద్ర, రాష్ట్ర లెవీలు, పన్నులు రీఫండ్ చేసేందుకు వీలుంటుంది.