బిజినెస్

మళ్లీ రికార్డు స్థాయికి బంగారం ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: బంగారం ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల బంగారంపై రూ. 25 పెరిగి మొత్తం ధర రికార్డు స్థాయి గరిష్టం రూ. 38.995కు చేరింది. రూపాయి బలహీన పడటమే ఇందుకు కారణమని వాణిజ్య వర్గాలు పేర్కొన్నాయి. గత మంగళవారం నుంచి బంగారం ధరలు ప్రతి రోజూ సరికొత్త గరిష్ట స్థాయిని నమోదు చేస్తున్నాయి. కాగా, వెండి ధరల్లో మాత్రం స్థిరత్వం కొనసాగుతోంది. కిలో వెండి రూ. 45,100 పలుకుతోంది. అంతర్జాతీయంగా బంగారానికి ఆదరణ అంతంతమాత్రమే అయినప్పటికీ నగల వ్యాపారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా దేశీయంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. శుక్రవారం ఆరంభ ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ రూ. 72కు చేరడం బంగారం ధరలు పెరిగేందుకు దోహదం చేసిందంటున్నారు. 22 పైసలు నష్టపోయిన రూపాయి 9 నెలల కనిష్టానికి చేరుకుంది. ఇలావుండగా స్పాట్ గోల్డ్ ధరలు న్యూయార్క్‌లో ఔన్సు ధర 1,496.30 డాలర్ల కనిష్ట స్థాయిలోట్రేడైంది. కాగా అక్కడ వెండి ధర దాదాపుగా స్తబ్ధుగానే ఉంది. ఔన్సు వెండి ధర 17.11 డాలర్లు పలికింది. అమెరన్ డాలర్ బలపడటంతోబాటు, అక్కడి స్టాక్ మార్కెట్లలో సైతం సానుకూలత నెలకొనడం బంగారం, వెండి ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని, అందుకే ఈ ధరలు కీలక 1500 డాలర్లకంటే దిగువ స్థాయికి చేరాయని విశే్లషకులు పేర్కొంటున్నారు. శుక్రవారం పొద్దుపోయాక ఆరంభమైన అమెరికన్ ఫెడరేషన్ ద్రవ్య వినిమయ విధాన సింపోజియంలో చైర్మన్ పావెల్ ఏమి చెబుతారన్న దానిపై అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు కొనసాగుతాయి. కాగా దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛ బంగారం 10 గ్రాములు రూ. 38,995, 99.5 శాతం స్వచ్ఛ బంగారం రూ. 38,825 వంతున ధర పలికాయి. అలాగే సవరం బంగారం రూ. 28,800 పలికింది. వెండి వా ర సరఫరా విధానంలో కిలో రూ. 43,666 పలికింది. అలాగే వెండి నాణేలు 100 పీసులు విక్రయాల్లో రూ. 91వేలు, కొనుగోళ్లలో రూ. 92వేల వంతున ధర పలికింది.