బిజినెస్

ఆర్థిక పునరుత్తేజ చర్యలతో మార్కెట్లకు ఆలంబన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : విదేశీ పోర్టుపోలియో పెట్టుబడుల (ఎఫ్‌పీఐలు)పై పెంచిన సర్‌చార్జీలు ఉపసంహరించుకోవడంతోబాటు మరిన్ని ఆర్థిక పునరుత్తేజ నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ చర్యలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమివ్వనున్నాయి. ఈక్రమంలో ఈవారం సూచీలు లాభాలను నమోదు చేసే అవకాశాలున్నాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. విదేశీ మదుపర్ల డిమాండ్లకు అనుగుణంగా గత శుక్రవారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించడం జరిగింది. విదేశీ పెట్టుబడులపై సర్‌చార్జీని పెంచుతూ గత కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన అనంతరం గడచిన జూలైతోబాటు, ప్రస్తుత నెలలో విదేశీ మదుపర్లు మొత్తం 3.4 బిలియన్ డాలర్లు (రూ. 24,500 కోట్లు) విలువైన దేశీయ వాటాలను ఉపసంహరించుకున్నారు. ఇంతపెద్ద మొత్తంలో నిధులు వెనక్కు మళ్లడం రూపాయి విలువపై సైతం దారుణ ప్రభావాన్ని చూపింది. దీంతో తాజాగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.72 కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈనేపథ్యంలో జరిగిన సర్‌చార్జి ఉపసంహరణ నిర్ణయం దేశ ఆర్థికాభివృద్ధి సెంటిమెంటుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ విభాగం అధిపతి రుష్మిక్ ఓజా పేర్కొన్నారు. అంకుర సంస్ధలకు ‘ఏంజల్ ట్యాక్స్’ రద్దు చేయడం, డీలాపడిన వాహన రంగానికి ఊతమిచ్చే ప్యాకేజీని ప్రకటించడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థికాభివృద్ధికి రూ. 75 వేల కోట్ల నిధుల సాయం చేయడం వంటి నిర్ణయాలు ఇప్పటి వరకు జరిగిన ఎఫ్‌పీఐ వాటాల ఉపసంహరణకు అడ్డుకట్ట వేస్తాయని, మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం ఉంటుందని మరోప్రముఖ విశే్లషకుడు వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ కంపెనీల ఆర్జన , దేశ వృద్ధి రేటు పెరిగితేనే మార్కెట్లు స్థిరమైన లాభాల బాటలోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇందుకోసం మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ప్రభుత్వ శాఖలకు వాహనాల కొనుగోలుపై ఉన్న ఆంక్షలను రద్దు చేయడంతోబాటు వచ్చే మార్చి వరకు తయారయ్యే వాహనాలపై మరో 15 శాతం పన్ను రాయితీ కల్పించడం, అలాగే ఏకదఫా రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచాలన్న ఆలోచనను సైతం 2020 జూన్ వరకు ఆపివేయడం వాహన రంగ పునరుత్తేజానికి ఊతమిస్తుందని ఆటో రంగానికి చెందిన సీనియర్ విశే్లషకుడు అశ్విన్ పాటిల్ అభిప్రాయపడ్డారు. సోమవారం నుంచే దేశీయ మార్కెట్లు సానుకూలంగా మొదలై కొన్ని రోజుల వరకు కొనసాగే అవకాశాలున్నాయని మరో విశే్లషకుడు అమిత్ గుప్తా తెలిపారు. గత వారం సెనె్సక్స్ 649.17 పాయింట్లు, నిఫ్టీ 1.74 పాయింట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. ఐతే శు క్రవారం గణనీయంగా పుంజుకున్న మార్కెట్ల ట్రెం డ్ కొనసాగే అవకాశాలున్నాయని అంటున్నారు.