బిజినెస్

భూముల ధరలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రోడ్డుపక్కనున్న భూములకు రెక్కలొచ్చాయి. అనేక పట్టణాల శివార్లలో ఇండ్ల స్థలాల రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో హైదరాబాద్‌కు పూర్వపు రియాల్టీ రంగ వైభవం తిరిగి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిష్టాకరంగా తీసుకున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన సర్వే పనులు ముగిశాయి. కేంద్రం నుంచి కూడా సాంకేతికంగా కొన్ని అనుమతులు రావాల్సి ఉంది. దాదాపు 11వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12వేల కోట్లు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పటి నుంచి మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. మిగతా రింగ్ రోడ్లకు రీజనల్ రింగ్ రోడ్డుకు వ్యత్యాసం ఉంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం కొత్త నిర్మాణం. 158 కి.మీ పొడువు ఉన్న ఈ ప్రాజెక్టు చుట్టూ ఇప్పటికే రేట్లు విపరీతంగా పెరిగి ఉన్నాయి.
రీజనల్ రింగ్ పొడువు 338 కి.మీ. దాదాపు 500 అడుగుల వెడల్పు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి నుంచి నర్సాపూర్, నర్సాపూర్ నుంచి తూఫ్రాన్, తూఫ్రాన్ నుంచి గజ్వేల్, గజ్వేల్ నుంచి జగదేవ్‌పూర్, జగదేవ్‌పూర్ నుంచి భువనగిరి, భువనగిరి నుంచి చౌటుప్పల్, చౌటుప్పల్ నుంచి షాద్‌నగర్, షాద్‌నగర్ నుంచి శంకరపల్లి, శంకర పల్లి నుంచి కంది, కంది నుంచి సంగారెడ్డి వరకు హైదరాబాద్ నగరం చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ పట్టణాల మధ్య ఆర్టీసి బస్సులు వెళ్లే కనీస సదుపాయాలతో కూడిన రోడ్డు ఉంది. ఈ రోడ్డునే వెడల్పు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యతతో రాజీపడకుండా ఈ రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ ప్రాజెక్టుకు వీలైనంత త్వరలో శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. హైదరాబాద్ నగరానికి మణిహారంగా అవతరించి రీజనల్ రింగ్ రోడ్డు మహిమతో రియాల్టీ మార్కెట్ జోరందుకుంది. రీజనల్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉండే భూముల రేట్లు ఐదేళ్ల క్రితం వరకు పెద్దగా ఉండేవి కావు. కొన్ని చోట్ల రూ.3 లక్షల నుంచి గరిష్టస్థాయిలో రూ.10 లక్షల వరకు ఎకరం భూమి ధర పలికేది. కాని ఈ రోజు ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తే మతిపోతుంది. శంకరపల్లి నుంచి కంది మీదుగా సంగారెడ్డి వరకు ఎకరం ధర రూ.1.4 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. ఈ ప్రాంతం మొదటి స్థానంలో ఉంది. శంకరపల్లిలో రైల్వే స్టేషన్ ఉండడం, ఎంఎంటీఎస్ రైలు సదుపాయం, కందిలో ఐఐటీతో పాటు హైటెక్ సిటీకి 25 కి.మీ దూరంలో ఉండడం వరంగా మారింది. శంకరపల్లి పరిసరాల్లో ఐదేళ్ల క్రితం వరకు గజం రూ.400 నుంచి రూ.1000 వరకు ఉన్నా కొనుగోలుకు పెద్దగా ఆసక్తి కనపరచలేదు. ఈ రోజు ప్రజలు శంకరపల్లి వైపు క్యూ కడుతున్నారు. షాద్‌నగర్ నుంచి శంకరపల్లి, గజ్వేల్ నుంచి భువనగిరి మధ్య కూడా రేట్లు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ రూ.60 లక్షల నుంచి కొన్ని చోట్ల రూ.1 కోటి వరకు ఎకరం ధర పలుకుతోంది. తూఫ్రాన్ నుంచి నర్సాపూర్, నర్సాపూర్ నుంచి సంగారెడ్డి మధ్య ఎకరం ధర రూ.50 లక్షల వరకు తక్కువలేకుండా ధర పలుకుతోంది. ఒక్కసారి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగితే, రేట్లు ఇంకా పైపైకివెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇక ఇండ్ల స్థలాల రేట్లు ఇంకా మధ్యతరగతికి అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. హైదరాబాద్ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు రేట్లు ఆకాశాన్నంటాయి. దీంతో భవిష్యత్తు అవసరాల నిమిత్తం, పెట్టుబడుల నిమిత్తం రెండు వందల గజాల నుంచి ఐదు వందల గజాల వరకు స్థలాలను జనం కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల పెద్ద గ్రామాల్లో కూడా గజం ధర రూ.10వేల వరకు ఎగబాకింది. భూములను వెంచర్లుగా మారుస్తున్నారు. అనధికార వెంచర్లపై హెచ్‌ఎండీఏ వేటు వేస్తున్న జనం ఆగడం లేదు. ఈ వెంచర్లలో గజం రూ. 5వేల వరకు విక్రయిస్తున్నారు. మరి కొన్ని చోట్ల గజం రూ.2 నుంచి రూ..3వేల వరకు అమ్ముతున్నారు. ఈ రింగ్ రోడ్డు వెంట పదేళ్ల క్రితం వరకు ఎకరం రూ. 3 నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న కొన్ని ప్రాంతాల్లో సెంటు భూమి ధర రూ.3 లక్షల నుంచి రూ.5లక్షలకు మారింది. హైదరాబాద్‌కు చేరుకునేందుకు మొత్తం తొమ్మిది రహదారులు ఉన్నాయి. బెంగళూరు, విజయవాడ, ముంబాయి, వికారాబాద్, నర్సాపూర్, నాగ్‌పూర్, రాజీవ్ రహదారి, వరంగల్ జాతీయ రహదారి, నాగార్జునసాగర్ రహదారి ఉన్నాయి. ఈ రహదారుల ద్వారా వచ్చే వాహనాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. దీని వల్ల కాలుష్యం తీవ్రమైంది. రీజనల్ రింగ్ రోడ్డు వల్ల సగానికి సగం వాహనాలు నగరంలోకి రాకుండానే రీజనల్ రింగ్ రోడ్డు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళుతాయి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ కావడం వల్ల గజ్వేల్-్భవనగిరి, గజ్వేల్-తూప్రాన్ మధ్య స్థలాలు, భూములు కొనుగోలు చేయడానికి ఇనె్వస్టర్లు మక్కువ చూపుతున్నారు. యాదాద్రి, ఏలూరునాచారం గుట్ట, వర్గల్, చిల్కూరు బాలాజీ లాంటి మహిమాన్వితమైన పవిత్ర పుణ్యక్షేత్రాలు రీజనల్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉండడం విశేషం.

చిత్రం...రీజనల్ రింగ్ రోడ్డు మ్యాప్